Kangana Vs Tapsee: ‘మనుషుల కుళ్లు స్వభావానికి ఇదో నిదర్శనం’.. తాప్సీ, కంగనాల మధ్య తారా స్థాయికి చేరిన మాటల యుద్ధం.

Kangana And Tapsee: గత కొద్ది రోజులుగా బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. మరీ ముఖ్యంగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్‌ విషయంపై నిత్యం ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ వార్తల్లో నిలిచారు కంగనా. అనంతరం..

Kangana Vs Tapsee: 'మనుషుల కుళ్లు స్వభావానికి ఇదో నిదర్శనం'.. తాప్సీ, కంగనాల మధ్య తారా స్థాయికి చేరిన మాటల యుద్ధం.
Kangana Vs Taapsee
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 01, 2021 | 9:38 PM

Kangana And Tapsee: గత కొద్ది రోజులుగా బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. మరీ ముఖ్యంగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్‌ విషయంపై నిత్యం ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ వార్తల్లో నిలిచారు కంగనా. అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వంతో వాగ్వాదానికి దిగడం ఇలా కంగనా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తూనే ఉన్నారు. ఇదే తరుణంలో నటి తాప్సీ, కంగనాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలుసార్లు వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి కంగనా పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా తాప్సీ తాను నటిస్తోన్న కొత్త సినిమా హసీనా దిల్‌రుబా అనే సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ‘ఎన్నో రోజుల నుంచి మీకూ, కంగనా రనౌత్‌కు మధ్య ట్విటర్‌ వేదికగా చిన్నపాటి వాగ్వాదం నడిచింది. ఇప్పుడు ఆమె ట్విటర్‌లో లేరు కదా. ఆమెను మీరు ఏమైనా మిస్‌ అవుతున్నారా?’ అని ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు స్పందించిన తాప్సీ.. ‘ఆమెను నేను పట్టించుకోను కాబట్టి ట్విటర్‌లో ఆమె లేకపోయినా నేను మిస్‌ కావడం లేదు’ అంటూ బదులిచ్చారు తాప్సీ. దీంతో ఈ విషయంపై కంగనా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు కంగనా. ‘నేను వదిలేసిన ప్రాజెక్ట్‌ల్లో తనకి అవకాశం కల్పించమని తాప్సీ ఎంతో మంది నిర్మాతలను బతిమలాడుకుని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. చిన్నస్థాయి నిర్మాతలకు కంగనా రనౌత్‌లా మారినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని తాప్సీ ఒకానొక సమయంలో చెప్పారు. కానీ ఇప్పుడు నన్ను పట్టించుకోను అని తాప్సీ చెబుతోంది. మనుషుల కుళ్లు స్వభవానికి ఇది చక్కటి ఉదాహరణ. ఏది ఏమైనా తాప్సీ.. నీ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అలాగే నీ సినిమా ప్రచారంలో నా పేరు లేకుండా చూసుకో’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు కంగనా. మరి వీరిద్దరి మధ్య మొదలైన ఈ మాటల యుద్ధానికి ఎప్పుడు ముగింపు పడుతుందో చూడాలి.

Also Read: Suman MAA Elections: ‘భారత్‌లో పుట్టిన వారంతా లోకల్‌’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్‌.. మా ఎన్నికలను ఉద్దేశించేనా?

singer Sunitha : పూల మధ్య డ్రెస్ లో అలరిస్తున్న సింగర్ సునీత..!వైరల్ అవుతున్న ఫొటోస్..

Sampoornesh Babu: సంపూది వెన్నలాంటి హృదయం.. తల్లిదండ్రుల ఆత్మహత్యతో అనాథాలుగా మారిన చిన్నారులకు అన్నీ తానై..