Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sampoornesh Babu: సంపూది వెన్నలాంటి హృదయం.. తల్లిదండ్రుల ఆత్మహత్యతో అనాథాలుగా మారిన చిన్నారులకు అన్నీ తానై..

Sampoornesh Babu: హృదయం కాలేయం సినిమాతో తెలుగు సినిమా తెరపై కొత్త ఒరవడిని సృష్టించారు నటుడు సంపూర్ణేశ్‌ బాబు. ఈ సినిమాలో తనదైన సెటైరికల్‌ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంపూర్ణేశ్‌ పలు సందర్భాల్లో తన మనసు ఎంత గొప్పదో..

Sampoornesh Babu: సంపూది వెన్నలాంటి హృదయం.. తల్లిదండ్రుల ఆత్మహత్యతో అనాథాలుగా మారిన చిన్నారులకు అన్నీ తానై..
Sampoornesh Babu
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 01, 2021 | 6:34 PM

Sampoornesh Babu: హృదయం కాలేయం సినిమాతో తెలుగు సినిమా తెరపై కొత్త ఒరవడిని సృష్టించారు నటుడు సంపూర్ణేశ్‌ బాబు. ఈ సినిమాలో తనదైన సెటైరికల్‌ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంపూర్ణేశ్‌ పలు సందర్భాల్లో తన మనసు ఎంత గొప్పదో చాటిచెప్పారు. విశాఖలో తుఫాను సంభవించిన సమయంలో ఆర్థిక సహాయం అందించి అప్పట్లో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ఇలా సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా తనవంతు సాయాన్ని అందిస్తూనే ఉన్నారు. తాజాగా సంపూర్ణేశ్‌ బాబు మరోసారి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. తల్లిందండ్రులను కోల్పోయిన అనాథలుగా మారిన ఇద్దరు ఆడ్డ బిడ్డలకు అండగా నిలిచారు సంపూర్ణేశ్‌. వివరాల్లోకి వెళితే సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెల్లాపూర్‌కు చెందిన నరసింహచారి దంపతులు అప్పుల బాధలతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరు కూతుళ్లు ఆనాథాలుగా మారారు. ఈ విషయాన్ని తెలుసుకున్న హీరో సంపూర్ణేశ్‌ బాబు.. ఆ ఇద్దరు బిడ్డలను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా వారికి రూ. 25 వేల చెక్‌ అందించడంతో పాటు వారికి విద్యకు అయ్యే పూర్తి ఖర్చును తామే భర్తీస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులతో పంచుకున్న సంపూ.. ‘దుబ్బాక లో నరసింహచారి గారి కుటుంబం లో జరిగిన ఈ వార్త చూసి గుండె కలిచివేసింది. కరోనా కష్టకాలంలో ఎంతో మంది పనులు కోల్పోయి వీధిన పడుతున్నారు. తల్లితండ్రులను కోల్పోయిన ఆ పిల్లలకు Rs.25000/- నేను, మా హృదయకాలేయం, కొబ్బరిమట్ట నిర్మాత సాయి రాశేష్‌ అందించాం. ఎంత వరకు చదువుకుంటే అంత పూర్తి ఖర్చులు మేము చూసుకుంటాం అని వారికి మాట ఇచ్చాం. ఈ కష్టకాలంలో తోటి వ్యక్తులకు మన వంతు సహాయం అందిచడం మన కర్తవ్యం’ అని రాసుకొచ్చారు సంపూ. ఇక సంపూర్ణేశ్‌ బాబు కెరీర్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం . ‘బజారు రౌడీ, ‘క్యాలీఫ్లవర్‌’, ‘పుడింగి నంబర్‌ వన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

సంపూ చేసిన ఫేబ్‌బుక్‌ పోస్ట్‌..

Also Read: Anasuya: లింగ సమానత్వంపై ఆరేళ్ల చిన్నారి ఆలోజింపజేసే ప్రశ్నలు.. తాను మద్ధతుగా నిలుస్తానంటోన్న అనసూయ.

Chiranjeevi: ‘వారిపట్ల ఎప్పటికీ కృతజ్ఞులైం ఉందాం’.. వైద్యులను ఉద్దేశించి ఎమోషనల్‌ పోస్ట్ చేసిన మెగాస్టార్‌..

Magadheera : 12 సంవత్సరాల తర్వత ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు జక్కన్న సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా..?