Chiranjeevi: ‘వారిపట్ల ఎప్పటికీ కృతజ్ఞులైం ఉందాం’.. వైద్యులను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాస్టార్..
Chiranjeevi: భాష, కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ వైద్యులను దైవంగా భావిస్తారు. దేవుడు జన్మనిస్తే, పునర్జన్మనిచ్చే వారిని వైద్యులంటారు. మరీ ముఖ్యంగా ప్రపంచం మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇలాంటి విపత్కర సమయంలో వైద్యులు..
Chiranjeevi: భాష, కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ వైద్యులను దైవంగా భావిస్తారు. దేవుడు జన్మనిస్తే, పునర్జన్మనిచ్చే వారిని వైద్యులంటారు. మరీ ముఖ్యంగా ప్రపంచం మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇలాంటి విపత్కర సమయంలో వైద్యులు చేస్తోన్న కృషి మరవలేనిది. సాటి వ్యక్తి ముందు నిలబడడానికే సంశయిస్తోన్న వేళ వైరస్ ముప్పు పొంచి ఉందని తెలిసినా వైద్యులు తమ సేవను మరవడం లేదు. ఇలా తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సేవందింస్తున్న వైద్యుల సేవలకు గుర్తుగా ప్రతీ ఏడాది జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటామన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఈ రోజును పురస్కరించుకొని చాలా మంది వైద్యుల సేవలకు గాను సోషల్ మీడియాలో పోస్టులుపెడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వైద్యుల గొప్పతనాన్ని వివరిస్తూ చిరు ఇలా ట్వీట్ చేశారు. ‘జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని.. డాక్టర్లందరికీ సెల్యూట్ చేస్తున్నాను. ఇతరుల ప్రాణాలను కాపాడగలిగే శక్తి ఒక్క వైద్యులకు మాత్రమే ఉంది. అందుకే వారిని వైద్యో నారాయణ హరి (వైద్యులు దైవంతో సమానం) అంటుంటాం. డాక్టర్లు మనుషుల రూపంలో ఉన్న దేవుళ్లు. మరీ ముఖ్యంగా ప్రపంచాన్ని భయపెట్టిస్తోన్న కరోనాలాంటి ఈ సంక్షోభ సమయంలో ఈ వాస్తవం మరోసారి రుజువైంది. వైద్యుల పట్ల ఎప్పటికీ కృతజ్ఞులైం ఉండాలి’ అంటూ రాసుకొచ్చారు.
చిరంజీవి చేసిన ట్వీట్..
Saluting ALL the Doctors on this #NationalDoctorsDay.Doctors are the ONLY beings who could save lives.#VaidyoNarayanoHarihi Doctors are the Human forms of Almighty GOD!During this global health crisis this fact has been reinforced yet again.Lets be grateful to them now & always!
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 1, 2021
Magadheera : 12 సంవత్సరాల తర్వత ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు జక్కన్న సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా..?