AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balakrishna: ‘విశ్వ విఖ్యాత నట సార్వభౌమ’ ఎన్టీఆర్ తనను ఎలా చూడాలనుకున్నారో చెప్పేసిన బాలయ్య

దేశ వ్యాప్తంగా నిర్వహించబడుతున్న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో నిర్వహించారు.

Nandamuri Balakrishna: 'విశ్వ విఖ్యాత నట సార్వభౌమ' ఎన్టీఆర్ తనను ఎలా చూడాలనుకున్నారో చెప్పేసిన బాలయ్య
Balayya With Sr Ntr
Ram Naramaneni
|

Updated on: Jul 01, 2021 | 4:43 PM

Share

దేశ వ్యాప్తంగా నిర్వహించబడుతున్న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆస్పత్రి ఛైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ హాజరైనారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముందుగా డాక్టర్లను, అధికారులను ఘనంగా ఆయన సన్మానించారు.

సన్మాన కార్యక్రమానంతరం శ్రీ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… ‘వైద్యో నారాయణ హరి’ అని మన సంస్కృతిలో పేర్కొనడమే డాక్టర్లకు మన సమాజంలో కలిపించిన స్థానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఎంతో ఆందోళనతో రోగానికి గురై వచ్చే పేషెంట్లకు వైద్యుడు దేవుని వలే కనిపిస్తాడని ఈ కోవలోనే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పని చేస్తోందని చెప్పారు. గత వారం దేశానికి ప్రణాళికలు రూపొందించే నీతి ఆయోగ్ వారు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చేస్తున్న సేవలను గుర్తించి లాభాపేక్ష లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ తో దీటుగా అంతర్జాతీయ స్థాయితో కూడిన నాణ్యమైన వైద్యం అందిస్తున్నదని పేర్కొనడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు.

తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తనను వైద్యుడిగా చూడాలని ఆశించారని అయితే నిజ జీవితంలో అది నెరవేరకపోయినా ఇపుడు హాస్పిటల్ కు ఛైర్మన్ గా వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించడం తన తండ్రి తలచిన కోరికను ఈ విధంగా నిజం చేసినట్లేనని భావిస్తున్నట్లు చెప్పారు. ఎలానైతే మహమ్మారి సమయంలో వైద్యులు కీలక పాత్ర పోషించారో భవిష్యత్తులోనూ ఇదే స్థాయి వైద్య సేవలు రోగులకు కలిపించడంలోనూ ముందంజలో ఉంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం డా. ప్రసన్న కుమార్, ప్రిన్సిపల్ ఛీఫ్ మెడికల్ డైరెక్టర్, దక్షిణ మధ్య రైల్వే వారు మాట్లాడుతూ మహమ్మారి కాలంలోనూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరాటంకంగా క్యాన్సర్ చికిత్సను అందించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సేవలను కొనియాడారు. ఇలా వీరు అందించిన సేవలకు గుర్తింపే నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక అని పేర్కొన్నారు. ఎటువంటి లాభాలను ఆశించకుండా నగరం మధ్యలో 500 పైగా పడకలతో కేవలం క్యాన్సర్ రోగుల కోసమే ఇంతటి మంచి హాస్పిటల్ నిర్వహించడం అనితర సాద్యమని చెప్పారు. సంస్థ రైల్వే ఉద్యోగులకు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

తర్వాత  డా. జి ఉదయ చంద్ర, అదనపు డైరెక్టర్, CGHS మాట్లాడుతూ తాము ఇప్పటి వరకు పంపిన పేషెంట్లలలో ఎవరూ కూడా ఈ సంస్థపై ఫిర్యాదులు చేయలేదని, ఈ అంశమే ఈ హాస్పిటల్ రోగులకు కేవలం సేవా భావంతో అందిస్తున్న సేవలకు గుర్తింపని అన్నారు. దీనికి నాంది పలికిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దానిని కొనసాగిస్తున్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారు చేస్తున్న మంచి పనులలో ఇది ఒకటని ఇదే వారి సేవానిరతిని తెలియజేస్తుందని అన్నారు.

Also Read: ఖమ్మం నడిరోడ్డిపై మనిషి తల.. మరి కొంచెం దూరం వెళ్లగానే….

ఆర్టీసీ బస్సుకు కరెంట్ షాక్.. మహిళ మృతి.. స‌మ‌యానికి ఆ మేస్త్రీ దేవుడిలా వ‌చ్చాడు

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ