Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు ఊరట..

Tollywood Celebrities Drugs Case : టాలీవుడ్ సినీతారల డ్రగ్స్ కేసు సర్వత్రా సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. అనేక మంది ప్రముఖుల పేర్లు

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు ఊరట..
tollywood drug case
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 01, 2021 | 9:39 PM

Tollywood Celebrities Drugs Case : టాలీవుడ్ సినీతారల డ్రగ్స్ కేసు సర్వత్రా సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. అనేక మంది ప్రముఖుల పేర్లు ఈ కేసుతో వెలుగులోకి వ‌చ్చాయి. హీరో రవితేజ సోదరుడు భ‌రత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన తరువాత టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పటివరకూ.. పోలీసులు ఛార్మి, ముమైత్ ఖాన్‌, త‌రుణ్‌, న‌వ‌దీప్‌, త‌నీష్‌తో పాటు ప‌లువురు ప్రముఖులను స్పెషల్ సెల్ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. విచార‌ణ‌కు హాజ‌రైన టాలీవుడ్ ప్రముఖుల రక్తం, జుట్టు, గోరు నమూనాలను సైతం పోలీసులు సేకరించి పరీక్షలకు పంపించారు.

హీరో రవితేజ సోదరుడు భ‌రత్ మరణించిన అనంతరం.. అతని మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు మాదకద్రవ్యాల రాకెట్‌పై దృష్టిసారించారు. ఈ క్రమంలో విచార‌ణ అనంత‌రం 2 జులై, 2017న 11 మంది టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 30 మందిని అరెస్టు చేశారు. హైద‌రాబాద్ ప‌రిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అనేక మంది డ్రగ్ విక్రేతలను పోలీసులు అరెస్టు చేసి పలు వివరాలను సేకరించారు.

స‌మ‌గ్ర దర్యాప్తు అనంత‌రం తెలంగాణ పోలీసులు కోర్టుకు తమ నివేదికను సమర్పించారు. ఈ నివేదిక‌ను కోర్టు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా నాలుగు సంవత్సరాల తరువాత న్యాయ‌స్థానం ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నివేదికతో11 మంది టాలీవుడ్ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణయాన్ని వెలువ‌రించింది.

Also Read:

TPCC: కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ షురూ.. రేవంత్‌పై గుర్రుగా ఉన్న సీనియర్ నేతలు.. కలిసేందుకు నో ఛాన్స్!

Best Work Place: దేశంలో ఉద్యోగానికి ఉత్తమమైన సంస్థ గూగుల్ ఇండియా..సర్వేలో వెల్లడి