AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితాంతం కన్యగా ఉంటా కానీ తాగుబోతును పెళ్లాడలేను..! వరుడు తాగివచ్చాడని పెళ్లి క్యాన్సల్ చేసిన వధువు..

Bride Cancels Wedding : మద్యప్రదేశ్‌లోని కుథౌండ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో విచిత్ర ఘటన జరిగింది. వరుడు తాగి వచ్చి గుర్రం మీద నుంచి

జీవితాంతం కన్యగా ఉంటా కానీ తాగుబోతును పెళ్లాడలేను..! వరుడు తాగివచ్చాడని పెళ్లి క్యాన్సల్ చేసిన వధువు..
Bride Cancels Wedding
uppula Raju
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 02, 2021 | 3:35 PM

Share

Bride Cancels Wedding : మద్యప్రదేశ్‌లోని కుథౌండ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో విచిత్ర ఘటన జరిగింది. వరుడు తాగి వచ్చి గుర్రం మీద నుంచి పడిపోవడంతో వధువు పెళ్లి క్యాన్సిల్ చేసింది. జీవితాంతం కన్యగా ఉంటా కానీ తాగుబోతును పెళ్లాడలేనని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. చివరికి కేసు పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది. పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పెళ్లిరోజు కుథౌండ్ పరిధిలోని వధువు గ్రామానికి పెళ్లి కొడుకు తరపు బంధువులు ఊరేగింపుగా వచ్చారు. వరుడు గుర్రంపై, భాజా భజంత్రీల మధ్య ఊరేగుతూ వచ్చారు.

పెళ్లి మండపం చేరుకున్న వరుడు గుర్రంపై నుంచి కిందికి దిగుతూ మూడుసార్లు కిందపడిపోయాడు. ఈ విషయాన్ని వధువు గమనించింది. అంతేకాదు వధువు కుటుంబ సభ్యులు వరుడిని ఎత్తుకొని మండపానికి తీసుకొచ్చేటప్పుడు అతడి దగ్గరి నుంచి వారికి మద్యం వాసన వచ్చింది. ఈ విషయం కూడా వధువుకు తెలిసి చాలా ఆగ్రహానికి గురైంది. వెంటనే అతడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. అయితే ఆమెను ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆమె ఎంతకు అంగీకరించలేదు. ఈ ఘటన జరిగిన తర్వరా వధువు మాట్లాడుతూ.. జీవితాంతం కన్యగానే ఉంటాను కానీ తాగుబోతును పెళ్లి చేసుకోను అని ఖరాకండిగా చెప్పేసింది.

ఆమెను పెళ్లికి ఒప్పించడానికి రెండు కుటుంబాలు ప్రయత్నం చేశాయి కానీ ఆమె ససేమిరా అంది. దీంతో రెండు కుంటుంబాల మధ్య వివాదం జరిగింది. ఈ సంఘటనపై వధువు పక్షం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు మండపానికి చేరుకొని ఇరు కుటుంబ సభ్యులను శాంతింపజేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. వరుడి కుటుంబానికి ఇచ్చిన కానుకలు, వస్తువులు అన్నీ తిరిగి వధువు కుటుంబానికి ఇచ్చేశారు. అదే సమయంలో వరుడి కుటుంబం వధువు కుటుంబానికి ఇచ్చిన కానుకలు కూడా తిరిగి ఇప్పించారు. దీంతో పెళ్లితతంగం ఆగిపోయింది. పీటల దాకా వచ్చిన పెళ్లి వధువు తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఆగిపోవడంతో స్థానికులందరు ఈ వివాహం గురించే మాట్లాడుకుంటున్నారు. వధువు తీసుకున్న నిర్ణయం చాలా సరైనదని సమర్థిస్తున్నారు.

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలిచేది వీరే.. ! ప్రకటించిన ఐఓఏ

Hot Masala Kichidi : ఇంట్లోనే వేడి వేడి మసాలా కిచిడీని తయారు చేయండి..! ఎలాగో తెలుసుకోండి..

UAE Ban Travel :14 దేశాలకు ప్రయాణ నిషేధం విధించిన యూఏఈ..! భారత్, పాకిస్తాన్‌ తో సహా ఈ దేశాలకు వెళ్లలేరు..