Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలిచేది వీరే.. ! ప్రకటించిన ఐఓఏ

టోక్యో ఒలింపిక్ గేమ్స్ జులై 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు భారత ఒలింపిక్స్ సంఘం అథ్లెట్ల లిస్టును విడుదల చేసింది. ఆగస్టు 8 వరకు జరగనున్న ఈ ఒలింపిక్స్ లో భారత్ నుంచి దాదాపు 117 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు.

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలిచేది వీరే.. ! ప్రకటించిన ఐఓఏ
Tokyo Olympics 2020
Follow us
Venkata Chari

|

Updated on: Jul 02, 2021 | 10:17 AM

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్ గేమ్స్ జులై 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు భారత ఒలింపిక్స్ సంఘం అథ్లెట్ల లిస్టును విడుదల చేసింది. ఆగస్టు 8 వరకు జరగనున్న ఈ ఒలింపిక్స్ లో భారత్ నుంచి దాదాపు 117 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్ గేమ్స.. కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయిని భావించిన అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం, జపాన్ ప్రభుత్వం కచ్చితంగా నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే గత కొద్ది రోజులుగా టోక్యోలో కరోనా కేసులు విపరీతంగా నమోదవ్వడంతో.. నిర్వాహాకుల్లోనూ భయం పట్టుకుంది. మరోవైపు వైద్య సంఘాలు ఈ సమయంలో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించవద్దని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఉగాండా ఆటగాళ్లకు, కోచ్ లకు పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకూ ఒలింపిక్స్ పోటీల్లో భారత అథ్లెట్లు 28 పతకాలు గెలుచుకున్నారు. ఈ సారి ఎక్కువమంది అథ్లెట్లు ఒలింపిక్స్ కు హాజరవ్వనున్న నేపథ్యంలో మరిన్ని పతకాలు సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్న అథ్లెట్లు, జపాన్ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అక్కడికి చేరుకున్నాక వారం రోజుల పాటు కఠిన క్వారంటైన్ లో ఉండనున్నారు. ఇక ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకు కూడా కఠిన నిబంధనలు అమలుచేయనున్నట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొంది.

బాక్సింగ్: మెన్స్ 52 కేజీ (ఫ్లయ్ వెయిట్): అమిత్ పంగల్. మెన్స్ 63 కేజీ (లైట్ వెయిట్): మనీష్ కౌశిక్. మెన్స్ 69 కేజీ (వెల్టర్ వెయిట్): వికాస్ క్రిషన్. మెన్స్ 75 కేజీ (మిడిల్ వెయిట్): ఆశిశ్ కుమార్. మెన్స్ 91 ప్లస్ కేజీ వెయిట్ (సూపర్ హెవీ వెయిట్): సతీశ్ కుమార్. ఉమెన్స్ 61 కేజీ (ఫ్లయ్ వెయిట్): మేరీ కోమ్. ఉమెన్స్ 60 కేజీ (లైట్ వెయిట్): సమర్ జిత్ కౌర్. ఉమెన్స్ 69 కేజీ (వెల్టర్ వెయిట్):లొవ్ లినా బొర్గోహెయిన్. ఉమెన్స్ 75 కేజీ (మిడిల్ వెయిట్): పూజా రాణి.

అథ్లెటిక్స్ మెన్స్ 400 మీటర్ల హర్డిల్: ఎంపీ జబ్బార్ మెన్స్ 4/400 రిలే: మొహమ్మద్ అనాస్ యాహియా, నోహా నిర్మల్ టామ్, అమోజ్ జాకబ్, అరోకియా రాజీవ్. మెన్స్ 20 కిలోమీటర్ల రేస్ వాక్: సందీప్ కుమార్, రాహుల్ రోహిలా, ఇర్ఫాన్ కొలోత్తుమ్ థోడి. మెన్స్ 3000 మీటర్స్ స్టిపుల్ ఛేజ్: అవినాష్ సాబ్లే. ఉమెన్స్ 200 మీటర్స్: ధ్యుతీ చంద్ ఉమెన్స్ 20 కి.మీ రేస్ వాక్: ప్రియాంకా గోస్వామి, భావనా జత్, మిక్స్ డ్ 4/400 మీటర్స్ రిలే: టీమ్ ను ఇంకా ప్రకటించ లేదు.

రెజ్లింగ్: మెన్స్ 57 కేజీ: రవి కుమార్ దహియా. మెన్స్ 65 కేజీ: భజరంగ్ పునియా. మెన్స్ 86 కేజీ: దీపికా పునియా. ఉమెన్స్ 50 కేజీ: సీమా బిస్లా. ఉమెన్స్ 53 కేజీ: వినీశ్ ఫోగట్. ఉమెన్స్ 57 కేజీ: అన్షు మాలిక్. ఉమెన్స్ 62 కేజీ: సోనమ్ మాలిక్.

ఫీల్డ్ ఈవెంట్స్: మెన్స్ జావలిన్ త్రో: నీరజ్ చోప్రా, శివపాల్ సింగ్. మెన్స్ లాంగ్ జంప్: మురళీ శ్రీశంకర్. మెన్స్ షాట్ పుట్: తేజేందర్ సింగ్ తోర్. ఉమెన్స్ డిస్కస్ త్రో: కమల్ ప్రీత్ కౌర్, సీమా పునియా. ఉమెన్స్ జావలిన్ త్రో: అన్ను రాణి.

బ్యాడ్మింటన్: మెన్స్ సింగిల్స్: సాయి బి. ప్రణీత్. మెన్స్ డబుల్స్: సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి. ఉమెన్స్ సింగిల్స్: పీవీ సింధు.

ఈక్వెస్ట్రియన్: ఫవద్ మీర్జా. ఫెన్సింగ్: సీఏ భవానీ దేవి.

గోల్ఫ్ మెన్స్ ఇన్డివిడ్యువల్: అనిరబ్ లహరి, ఉదయన్ మనే. ఉమెన్స్ ఇన్డివిడ్యువల్: అదితి అశోక్.

రోయింగ్ మెన్స్ లైట్ వెయిట్ డబుల్ స్కుల్స్: అర్జున్ లాల్, అరవింద్ సింగ్.

టెన్నిస్ ఉమెన్స్ డబుల్స్: సానియా మీర్జా, అంకితా రైనా.

వెయిట్ లిఫ్టింగ్: మీరాబాయి చానూ.

సెయిలింగ్ మెన్స్ లాసర్: విష్ణు శరవణన్. మెన్స్ 49 లాసర్: కేసీ గణపతి, వరుణ్ థక్కర్. ఉమెన్స్ లేసర్ రేడియల్: నేత్రా కుమనన్.

ఆర్చరీ మెన్స్ ఇన్డివిడ్యువల్: అతాను దాస్, తరుణ్ దీప్ రాయ్, ప్రవీణ్ యాదవ్. మెన్స్ టీమ్: అతాను దాస్, తరుణ్ దీప్ రాయ్, ప్రవీణ్ యాదవ్. ఉమెన్స్ ఇన్డివిడ్యువల్: దీపికా కుమారి, ఉమెన్స్ టీమ్: దీపికా కుమారి, దాస్

షూటింగ్ మెన్స్ 50 మీటర్ల రైఫిల్ (3 పొజిషన్స్): సంజీవ్ రాజ్ పుత్, ఐశ్వరై ప్రతాప్ సింగ్ తోమర్. ఉమెన్స్ 50 మీటర్ల రైఫిల్ (3 పొజిషన్స్) అంజుమ్ మౌద్గిల్, తేజశ్వి సావంత్. ఉమెన్స్ 25 మీటర్ల పిస్టల్: మనూ భాకర్, రాహి సర్నోబత్. మెన్స్ స్కీట్: అంగద్ బజ్వా, మైరాజ్ అహ్మద్ ఖాన్. మిక్సెడ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: దివ్యాన్స్ సింగ్ పన్వార్, ఎలవెనిల్ వలరివన్ జోడి, దీపక్ కుమార్, అంజుమ్ జోడి. మిక్సెడ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: సౌరబ్ చౌదరి మరియు మనూ భాకర్ జోడి, అభిషేక్ వర్మ మరియు యశశ్విని సింగ్ దేశ్వాల్ జోడి. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: దివ్యాన్ష్ సింగ్ పన్వార్, దీపక్ కుమార్. ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: అపూర్వి చండేలా, ఎలవెనిల్ వలరివన్. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: సౌరబ్ చౌదరి, అభిషేక్ వర్మ. ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: మనూ భాకర్, యశశ్వి సింగ్ దేశ్వాల్.

జిమ్నాస్టిక్స్: ప్రణతి నాయక్.

జూడో ఉమెన్స్ 48 కేజీ: సుశీలా దేవి.

స్విమ్మింగ్ ఉమెన్స్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్: మన్నా పటేల్. మెన్స్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్: శ్రీహరి నటరాజ్. మెన్స్ 200 మీటర్ల బటర్ ఫ్లయ్: సంజన్ ప్రకాశ్.

టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్: సతియన్ జ్ఞానశేఖరన్, ఆచంట శరత్ కమల్. ఉమెన్స్ సింగిల్స్: మనికా బాత్రా, సుతీర్థ ముఖర్జీ. మిక్సెడ్ డబుల్స్: ఆచంట శరత్ కమల్, మనితా బాత్రా.

Also Read:

Rajiv Gandhi Khel Ratna: ఖేల్ రత్న బరిలో కోనేరు హంపి.. అర్జున అవార్డులకు మరో ఏడుగురు: అఖిల భారత చెస్ సమాఖ్య

India vs Srilanka: టీమిండియా ఆటగాళ్ల ‘గెస్సింగ్‌ గేమ్‌’ షో.. ఆకట్టుకున్న శిఖర్, పృథ్వీషా..!

Jasprit Bumrah: భార్యతో నవ్వుతూ ఫొటోలు దిగడం కాదు.. ముందు వికెట్లు తియ్యు..! టీమిండియా పేసర్ పై నెటిజన్ల ట్రోల్స్..