Jasprit Bumrah: భార్యతో నవ్వుతూ ఫొటోలు దిగడం కాదు.. ముందు వికెట్లు తియ్యు..! టీమిండియా పేసర్ పై నెటిజన్ల ట్రోల్స్..

Venkata Chari

Venkata Chari |

Updated on: Jul 02, 2021 | 8:58 AM

టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విహారంలో ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ తరువాత, ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ జరిగేందుకు చాలా సమయం ఉన్నందున.. బీసీసీఐ ఆటగాళ్లకు విరామం ప్రకటించింది. దీంతో లండన్ వీధుల్లో ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్నారు.

Jasprit Bumrah: భార్యతో నవ్వుతూ ఫొటోలు దిగడం కాదు.. ముందు వికెట్లు తియ్యు..! టీమిండియా పేసర్ పై నెటిజన్ల ట్రోల్స్..
Jasprit Bumrah
Follow us

Jasprit Bumrah: టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విహారంలో ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ తరువాత, ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ జరిగేందుకు చాలా సమయం ఉన్నందున.. బీసీసీఐ ఆటగాళ్లకు విరామం ప్రకటించింది. దీంతో లండన్ వీధుల్లో ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్నారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ను టార్గెట్ చేసిన క్రికెట్ ప్రేమికులు దారుణంగా ట్రోల్ చేశారు. అయితే మిగతా ఆటగాళ్లు కూడా ఫొటోలను షేర్ చేయగా, బుమ్రాను మాత్రమే ట్రోల్ చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. జస్‌ప్రీత్ బుమ్రా సోషల్ మీడియా వేదికగా తన భార్య సంజనా గణేశన్‌తో దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఈ ఫొటోను ట్యాగ్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేశారు. న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ 8 వికెట్లతో ఓడిపోయన విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో కోపంతో రగిలిపోతున్న క్రికెట్ ప్రేమికులు.. బుమ్రా ఫొటోపై విరుచుకపడ్డారు. పేస్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై కూడా వికెట్లు తీయకపోవడంతో రగిలిపోతున్నారు. దీంతో బుమ్రా.. తన భార్యలో దిగిన ఫొటోను షేర్ చేయడంతో ఆగ్రహానికి గురయ్యారు. కొన్ని రోజులు ఫొటోలు షేర్ చేయకుండా ఉండాలని, భార్యతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నావ్ అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లోనూ బుమ్రా కారణంగానే టీమిండియా ఓడిపోయిందని గుర్తు చూస్తూ.. ట్రోల్స్.. మీమ్స్ తో విరుచుకపడుతున్నారు.

ఇంకొందరైతే బుమ్రా సతీమణి సంజనను కూడా టార్గెట్ చేశారు. ‘వివాహం తరువాత ఫొటోలపై పడ్డావు.. నీ ఆట పూర్తిగా తగ్గిపోయింది. నవ్వుతూ ఫొటోలు దిగడం కాదు.. ముందు వికెట్లు తీయవయ్యా అంటూ కామెంట్లు చేశారు. అలాగే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్‌ తరపున ఇరగదీస్తావు.. టీమిండియా తరపున మాత్రం ఎందుకిలా చేస్తున్నావు అంటూ ట్రోల్స్ చేశారు. ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు మొదలుకానుంది. ఈ సిరీస్ లోనైనా వికెట్లు తీసి పరువు కాపాడుకోవాలని సూచిస్తున్నారు. టెస్ట్ సిరీస్‌కు ఆరు వారాల సమయం ఉండడంతో ఆటగాళ్లు బుడలో ఉంటే ఒత్తిడికి గురవుతారని బీసీసీఐ భావించింది. అందుకే ఆటగాళ్లకు మూడు వారాల పాటు విరామం ఇచ్చారు. అయితే, కోహ్లీ సేన ప్రాక్టీస్ మ్యాచ్ లకు ఈసీబీ పచ్చజెండా ఊపడంతో.. టెస్టు సిరీస్ ముందు ఆటగాళ్లకు కొంత ప్రాక్టీస్ దొరకనుంది.

Also Read:

Instagram Posts : ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా అత్యధికంగా సంపాదించే ఆటగాళ్లు వీరే..! మీరు ఓ లుక్కేయండి..

Alastair Cook Coments : భారత ఆటగాళ్లు ఇలాంటి బంతులను ఎదుర్కోలేరు..! అదే వారి బలహీనత.. హాట్ కామెంట్ చేసిన ఇంగ్లాండ్ మాజీ సారథి..

Wimbledon 2021 Day 4 Highlights: సానియా జోడీ శుభారంభం; ఫెదరర్ ముందంజ.. స్వితోలినా పోరాటానికి తెర!

Womens Handball: త్వరలో మహిళల హ్యాండ్‌బాల్ ప్రీమియర్ లీగ్.. ది బ్లూ స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఒప్పందం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu