Alastair Cook Coments : భారత ఆటగాళ్లు ఇలాంటి బంతులను ఎదుర్కోలేరు..! అదే వారి బలహీనత.. హాట్ కామెంట్ చేసిన ఇంగ్లాండ్ మాజీ సారథి..
Alastair Cook Coments : భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లినప్పుడల్లా ఆటగాళ్లు అక్కడి పరిస్థితులను ఎలా తట్టుకుంటారు.. స్వింగ్ బంతులను ఎలా
Alastair Cook Coments : భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లినప్పుడల్లా ఆటగాళ్లు అక్కడి పరిస్థితులను ఎలా తట్టుకుంటారు.. స్వింగ్ బంతులను ఎలా ఎదుర్కొంటున్నారనేదే ప్రధానంగా చర్చ. సాధారణంగా భారత బ్యాట్స్‌మెన్‌లు స్వింగ్ బంతులను ఎక్కువగా ఆడలేరని ప్రపంచంలోని చాలా మంది ఆటగాళ్ళు నమ్ముతారు. ఇటీవల ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ స్వింగ్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారని పలువురు మాజీ ఆటగాళ్లు అంటున్నారు. రాబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పిచ్ ఇంగ్లాండ్ బౌలర్లకు అనుకూలిస్తే భారత్ కష్టాలను ఎదుర్కోవల్సి వస్తోందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ అభిప్రాయపడుతున్నాడు.
కుక్ మాట్లాడుతూ.. భారత జట్టు అద్భుతంగా ఉంది కానీ ఇంగ్లాండ్ పిచ్‌లపై బంతి స్వింగ్ అవుతోంది. ఆగస్టులో పరిస్థితి ఇలాగే ఉండి పిచ్‌లో తేమ ఉంటే ఇంగ్లాండ్ పైచేయి సాధిస్తుంది. భారత బ్యాట్స్‌మెన్ల బలహీనత స్వింగ్ బంతులను ఎదుర్కోకపోవడం. అప్పుడు ఇలాంటి బంతులను వేసి భారత్‌పై పై చేయి సాధించవచ్చని అలెస్టర్ కుక్ అంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సంబంధించి వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఒక అదనపు ఫాస్ట్ బౌలర్‌కు బదులుగా ఇద్దరు స్పిన్నర్లను ఎన్నుకోవడం భారత్ చేసిన తప్పు అన్నారు. మ్యాచ్ సమయంలో వర్షం పడుతుందని తెలిసినప్పటికీ మ్యాచ్‌కు మూడు రోజుల ముందు జట్టును ఎంపిక చేసి ఇద్దరు స్పిన్నర్లను ఆడించడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపాడు. భారత్ ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడవలసి ఉంది. అంతకుముందు ఇండియాకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షుబ్మాన్ గిల్ గాయం కారణంగా రెండు నెలలు అవుటయ్యాడు. సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లలో ఆడటం సాధ్యం కాదు అతని స్థానంలో మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ ఎవరో ఒకరు బరిలోకి దిగవచ్చు.