IND vs ENG: అచ్చం ధోనీలానే.. మిస్టర్ కూల్ కాదిక్కడ.. మిస్ కూల్ షె‎ఫాలీ వర్మ అంటోన్న నెటిజన్లు..!

భారత పురుషుల క్రికెట్ జట్టుతో పాటు మహిళల టీం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తరువాత కోహ్లీ సేన ప్రస్తుతం విహారయాత్రలో ఉంది.

IND vs ENG: అచ్చం ధోనీలానే.. మిస్టర్ కూల్ కాదిక్కడ.. మిస్ కూల్ షె‎ఫాలీ వర్మ అంటోన్న నెటిజన్లు..!
Shefali Verma Reminds Ms Dhoni Style
Follow us
Venkata Chari

|

Updated on: Jul 01, 2021 | 7:29 PM

IND vs ENG: భారత పురుషుల క్రికెట్ జట్టుతో పాటు మహిళల టీం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తరువాత కోహ్లీ సేన ప్రస్తుతం విహారయాత్రలో ఉంది. వచ్చే నెల నుంచి ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్‌ ఆడనుంది. మరోవైపు మిథాలీ సేన ఏకైక టెస్టును డ్రా చేసుకుంది. అనంతరం జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌లో రెండు వన్డేలు ఓడిపోయి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఇంగ్లండ్‌ కి అప్పగించింది. అయితే రెండో వన్డేలో యువ బ్యాట్స్‌ ఉమెన్ షెఫాలి వర్మ చేసిన ప్రదర్శన.. భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనీని గుర్తుకు చేసేలా ఉంది. అచ్చం ధోనీ లాగే చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ ల మధ్య రెండో మ్యాచ్‌లో భారత్ మొదటి బ్యాటింగ్ చేసింది. మొదటి వన్డేలో విఫలమైన ఓపెనర్ షెఫాలి.. రెండో వన్డేలో మాత్రం 44 పరుగులతో ఆకట్టుకుంది. 55 బంతుల్లో ఏడు ఫోర్లు కొట్టి హాఫ్ సెంచరీ దిశగా సాగుతోంది. కానీ, ఇంతలో ధోనీలా ఔట్ అవ్వడంతో.. సోషల్ మీడియాలో మిస్టర్ కూల్ లాగే మిస్ కూల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ధోనీ స్టైల్ కాపీ అంటూ.. 44 పరుగులతో ఆడుతున్న షెఫాలీ.. బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయింది. ముందుకు వచ్చి ఆడబోయింది. కానీ, బంతి నేరుగా వికెట్ కీపర్ అమీ జోన్స్ చేతుల్లో పడింది. వెంటనే షెఫాలి ఒక కాలును పూర్తిగా పొడవుగా చాపి క్రీజులో ఉంచేందుకు ప్రయత్నించి ఔట్ అయింది. అయితే ధోనీ కూడా చాలాసార్లు ఇలానే ఔటయ్యాడు. ప్రస్తుతం షెఫాలీ కూడా ధోనీ తీరుగా ఔటవ్వగా నెట్టింట్లో కామెంట్లు పేలుతున్నాయి. ధోనిని జ్ఞాపకం చేసిందంటూ పొగుడుతున్నారు.

Also Read:

Wimbledon 2021: వింబుల్డన్ ‘స్పైడర్ మ్యాన్‌’ ని చూశారా..? నెటిజన్ల రియాక్షన్ మాములుగా లేదుగా!

Hyderabad FootBall Club: డానిష్ బ్రాండ్ తో హైదరాబాద్ ఎఫ్‌సీ ఒప్పందం; హెచ్‌ఎఫ్‌సీ కిట్ స్పాన్సర్‌గా హమ్మెల్!

Michael Vaughan: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వాన్ వక్రబుద్ధి; కోహ్లీపై మరోసారి..! ఫైర్ అవుతోన్న ఫ్యాన్స్

Lords Cricket Stadium: టెస్టు మ్యాచ్ లో టీ20 సునామీ.. ఒక్కరోజులో 3 సెంచరీలు, 500 పరుగులతో సంచలనం..!