టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. 48 బంతుల్లో శతకం.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఎడమచేతి వాటం ఓపెనర్

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Jul 01, 2021 | 4:34 PM

అంతర్జాతీయ క్రికెట్‌లో అతనొక విధ్వంసకర ఓపెనర్. క్రీజులోకి వచ్చాడంటే బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. పరిమితి ఓవర్లకు స్పెషలిస్ట్. తనదైన..

టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. 48 బంతుల్లో శతకం.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఎడమచేతి వాటం ఓపెనర్
Jayasurya

Follow us on

అంతర్జాతీయ క్రికెట్‌లో అతనొక విధ్వంసకర ఓపెనర్. క్రీజులోకి వచ్చాడంటే బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. పరిమితి ఓవర్లకు స్పెషలిస్ట్. తనదైన దూకుడుతనంతో ఎన్నో రికార్డులు సృష్టించాడు. అంతేకాకుండా టీమిండియాపై అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అతడెవరో కాదు శ్రీలంక లెజెండరీ బ్యాట్స్‌మెన్‌ సనత్ జయసూర్య. ఈరోజు జయసూర్య పుట్టినరోజు.. అతడు సాధించిన కొన్ని రికార్డులు, చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

  •  మొదటిసారిగా శ్రీలంక 1996లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ప్రపంచకప్‌లో జయసూర్య ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. అలాగే క్వార్టర్ ఫైనల్స్‌లో జయసూర్య ఇంగ్లాండ్‌పై కేవలం 44 బంతుల్లో 82 పరుగులు చేశాడు.
  • శ్రీలంకను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అనంతరం సింగపూర్‌ వేదికగా జరిగిన శ్రీలంక, భారత్, పాకిస్థాన్ మధ్య ట్రై సిరీస్‌లో జయసూర్య చిన్న సైజు విధ్వంసాన్ని సృష్టించాడు. తుఫాను ఇన్నింగ్స్‌లతో అదరగొట్టాడు. కేవలం 48 బంతుల్లోనే సూపర్ ఫాస్ట్ సెంచరీ పూర్తి చేసి అద్భుత రికార్డును నెలకొల్పాడు. పాకిస్థాన్‌పై 65 బంతుల్లో 134 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి.
  • 29 అక్టోబర్ 2000న షార్జాలో భారత్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్..టీమిండియా అభిమానులకు ఓ చేదు జ్ఞాపకం అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో భారత్ 54 పరుగులకే ఆలౌట్ అయింది. ఇదే వన్డేల్లో టీమిండియా అత్యల్ప స్కోర్. ఇక ఈ మ్యాచ్‌లో జయసూర్య తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 21 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 189 పరుగులు చేశాడు.
  • వన్డేల్లోనే కాదు, టెస్టుల్లో కూడా జయసూర్య ఎన్నో రికార్డులు సృష్టించాడు. 1997లో టీమిండియా శ్రీలంక పర్యటనకు రాగా.. కొలంబో వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో జయసూర్య భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 340 పరుగులు చేసి అదరగొట్టాడు.
  • 1998లో, శ్రీలంక ఇంగ్లాండ్‌లో పర్యటించింది, అక్కడ వన్డేలు, ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 445 పరుగులు చేసింది. అనంతరం జయసూర్య 213 పరుగులు చేసి అద్భుతాన్ని సృష్టించాడు.

Also Read: 

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..

సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu