Michael Vaughan: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వాన్ వక్రబుద్ధి; కోహ్లీపై మరోసారి..! ఫైర్ అవుతోన్న ఫ్యాన్స్

ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌ తన వక్రబుద్ధిని మానుకోలేదు. మరోసారి టీమిండియాపై హేళనగా మాట్లాడాడు. మహిళల క్రికెట్‌ జట్టును ప్రశంసిస్తూ కెప్టెన్ కోహ్లీ పై ఎగతాళిగా మాట్లాడాడు.

Michael Vaughan: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వాన్ వక్రబుద్ధి; కోహ్లీపై మరోసారి..! ఫైర్ అవుతోన్న ఫ్యాన్స్
Viral Kohli And Michael Vaughan
Follow us

|

Updated on: Jul 01, 2021 | 3:12 PM

Michael Vaughan: ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌ తన వక్రబుద్ధిని మానుకోలేదు. మరోసారి టీమిండియాపై హేళనగా మాట్లాడాడు. మహిళల క్రికెట్‌ జట్టును ప్రశంసిస్తూ కెప్టెన్ కోహ్లీ పై ఎగతాళిగా మాట్లాడాడు. కనీసం భారత మహిళల జట్టైనా ఇక్కడి పరిస్థితుల్లో పోరాడుతోందని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో భారత మహిళలు, పురుషుల జట్లు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఏకైక టెస్టును భారత మహిళలు డ్రా చేసుకున్న సంతగి తెలిసిందే. అయితే 3 వన్డేల సిరీసును మరో వన్డే మ్యాచ్ మిగిలి ఉండగానే చేజార్చుకున్నారు. వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పాలైంది. తొలి వన్డేతో పోలిస్తే సెకండ్ వన్డేలో మెరుగైన ప్రదర్శన చేసి, 200పైగా స్కోర్ నమోదు చేసింది. ఈ సందర్భంగా వాన్ ‘భారత మహిళల జట్టు నేడు అద్భుత పోరాటం చేసింది… ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఒక్క భారత కనీస ఆటను ప్రదర్శిస్తుడడం బాగుంది…’ అని ట్వీట్‌ చేశాడు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే, మహిళల జట్టు సెకండ్ వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వీటిని పోలుస్తూ వాన్‌.. ఇలా వ్యగ్యంగా ట్వీట్‌ చేశాడు. దీంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఘోరమైన కామెంట్లతో చీల్చి చెండాడుతున్నారు. ఈయన ఎప్పుడు ఇలానే మాట్లాడుతాడని, కోహ్లీ సేన టెస్టు సిరీస్ లో అసలు సంగతి చూపిస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

World Test Championship: రెండవ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ షురూ.. ఈ సారి మార్పులు ఇవే..!

Lords Cricket Stadium: టెస్టు మ్యాచ్ లో టీ20 సునామీ.. ఒక్కరోజులో 3 సెంచరీలు, 500 పరుగులతో సంచలనం..!

Latest Articles