Lords Cricket Stadium: టెస్టు మ్యాచ్ లో టీ20 సునామీ.. ఒక్కరోజులో 3 సెంచరీలు, 500 పరుగులతో సంచలనం..!

టెస్టు మ్యాచ్ లో మాహా అంటే రోజుకు సరాసరిగా 300 పరుగులు చేస్తారు. కానీ, మొదటిసారి ఓ జట్టు ఏకంగా టెస్టుల్లో టీ20 సునామీ సృష్టించి, ఒక్క రోజులో 500 పరుగులు, 3 సెంచరీలతో ప్రపంచ రికార్డును క్రియోట్ చేసింది.

Lords Cricket Stadium: టెస్టు మ్యాచ్ లో టీ20 సునామీ.. ఒక్కరోజులో 3 సెంచరీలు, 500 పరుగులతో సంచలనం..!
Ed Cowan 1 4
Follow us
Venkata Chari

|

Updated on: Jul 01, 2021 | 1:31 PM

Lords Cricket Stadium: క్రికెట్ టో పరిమిత ఓవర్లు ఎంటరయ్యాక టెస్టు మ్యాచ్ లపై జనాలకు ఆసక్తి తగ్గింది. కొన్ని మ్యాచులు మాత్రమే అలరిస్తుండగా, చాలా మ్యాచులు మాత్రం బోరింగ్ గా తయారయ్యాయి. అప్పుడప్పుడు కొందరు ఆటగాళ్లు టెస్టుల్లో టీ20 తరహాలో ఆడుతున్నా.. జనాలకు టెస్టులు మాత్రం ఎక్కడం లేదు. అందుకే ఐసీసీ టెస్టులపై ఆసక్తిని పెంచేందుకు ప్రపంచ టెస్టు ఛాపింయన్ షిప్ ను ప్రవేశపెట్టింది. టెస్టుల్లో కొన్ని మ్యాచ్ లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ఓ మ్యాచ్ ను ఇప్పుడు చూద్దాం.. టెస్టు చరిత్రలో టీ20 సునామీ సృష్టించి, ఒక్కరోజులోనే 500 పరుగులతో 3 సెంచరీలతో చెలరేగిపోయారు. అంతగా చెలరేగిపోయిన టీం ఏదంటే క్రికెట్ కి పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్. అది కూడా లార్డ్స్ మైదానంలో సాధించింది. ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య జూన్ 30 న జరిగింది. తొలి ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా 273 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా టీంలో బాబ్ కాట్రాలో 120 పరుగులతో నిలవగా, ఫ్రెడ్ సుస్కింగ్ 64, నామి డీన్ 33 పరుగులతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ తరపున ఆర్థర్ గిల్లిగాన్, డిక్ టిల్డెస్లీ తలో మూడు వికెట్లు పడగొట్టారు. మోరిస్ టేట్ రెండు వికెట్లు తీశాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. రెండు వికెట్ల నష్టానికి 531 పరుగులు సాధించి డిక్లెర్ చేసింది. ఆజట్టు ఒక్క రోజులో 503 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఇంగ్లండ్ తరపున ఓపెనర్ జాక్ హోబ్స్ 211 పరుగులు చేయగా, మరో ఓపెనర్ హెర్బర్ట్ సుట్క్లిఫ్ 122 పరుగులు చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఫ్రాంక్ వూలీ 134 పరుగులతో అజేయంగా నిలిచాడు. అలాగే మరో బ్యాట్స్ మెన్ ప్యాట్సీ హండ్రెన్ 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా 240 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 18 పరుగులతో సంచలన విజయం సాధించింది. అయితే, ఇంగ్లండ్ సాధించిన ఈ రికార్డును శ్రీలంక జట్టు 2002లో బద్దలు కొట్టింది. ఆ జట్టు బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఒక్క రోజులో 509 పరుగులు చేసి, ఇంగ్లండ్ ను రెండోస్థానానికి నెట్టేసింది.

Also Read:

Viral Video: సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

Tokyo Olympics: టోక్యోలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒలింపిక్స్ నిర్వాహాకుల్లో మొదలైన టెన్షన్..!

INDW vs ENGW: రెండేళ్ల తరువాత 200 దాటారు.. అయినా ఓడిన భారత మహిళలు.. సిరీస్ ఇంగ్లండ్ వశం..!