Tokyo Olympics: టోక్యోలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒలింపిక్స్ నిర్వాహాకుల్లో మొదలైన టెన్షన్..!

మరో 22 రోజుల్లో టోక్యో ఒలింపిక్ గేమ్స్ మొదలుకానున్నాయి. అయితే, ప్రస్తుతం టోక్యోలో కరోనా కేసులు పెరుగుతుండడంతో.. ఒలింపిక్  నిర్వాహాకుల్లో టెన్షన్ మొదలైంది.

Tokyo Olympics: టోక్యోలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒలింపిక్స్ నిర్వాహాకుల్లో మొదలైన టెన్షన్..!
Tokyo Olympic Games 2021
Follow us

|

Updated on: Jul 01, 2021 | 12:16 PM

Tokyo Olympics: మరో 22 రోజుల్లో టోక్యో ఒలింపిక్ గేమ్స్ మొదలుకానున్నాయి. అయితే, ప్రస్తుతం టోక్యోలో కరోనా కేసులు పెరుగుతుండడంతో.. ఒలింపిక్  నిర్వాహాకుల్లో టెన్షన్ పెరుగుతోంది. గత నెల 21 నుంచి అన్ లాక్ చేయగా, అప్పటి నుంచి విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం 238 కేసులు నమోదు కాగా, బుధవారం ఒక్కరోజే దాదాపు 714 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అత్యధిక కేసుల సంఖ్య మేరకు నిన్న నమోదైన కేసులే తొలిస్థానంలో నిలవడంతో.. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. గత వారం రోజులుగా కేసులను పరిశీలిస్తే.. 500కు పైగానే నమోదవుతున్నాయి. ఇక జపాన్‌లో బుధవారం 1821 కేసులు నమోదవ్వగా.. అందులో 40 శాతం టోక్యోలోనే నమోదవ్వడం గమనార్హం. దీంతో ఒలింపిక్స్‌ నిర్వాహకుల్లో భయం పెరుగుతోంది. అయితే, ఇప్పటికే ఒలింపిక్స్ విలేజ్ చేరుకున్న ఉగాండా క్రీడాకారులతోపాటు, కోచ్ లకు పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో విదేశాల నుంచి అథ్లెట్లు, వారితోపాటు సహాయకులు, కోచ్ లు ఒలింపిక్ విలేజ్ కు చేరుకోనున్నారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరో 22 రోజుల్లో టోక్యో సమ్మర్ గేమ్స్‌ మొదలుకానున్నాయి. అయితే టోక్యో లో ప్రస్తుతం పరిస్థితి మేరకు క్రీడలు సక్రమంగా జరుగుతాయా లేదా అనేది సందేహంగా ఉంది. అసలే 2020 లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా తో ఈ ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అలాంటి పరిస్థితులే నెలకొన్నందున నిర్వాహాకులకు టెన్షన్ పెరుగుతోందంట. కచ్చితంగా ఒలింపిక్స్ నిర్వహిస్తామని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ, జపాన్‌ ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. కానీ, వైద్య సంఘాలతోపాటు ప్రజలు ఒలింపిక్ గేమ్స్ నిర్వహించొద్దని కోరుతున్నాయి. కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్న తరుణంలో మరోసారి వాయిదా వేయాలనే డిమాండ్ బాగా పెరుగుతోంది.

మరోవైపు భారత్‌ నుంచి దాదాపు 100కుపైగా అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్నారు. వీరు 14 ఈవెంట్లలో భారత్ కు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, ఈక్వెస్ట్రియన్‌,  రోయింగ్‌, సెయిలింగ్‌, షూటింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, ఫెన్సింగ్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ, రెజ్లింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ లాంటి వివిధ పోటీల్లో తమ సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నారు.

Also Read:

INDW vs ENGW: రెండేళ్ల తరువాత 200 దాటారు.. అయినా ఓడిన భారత మహిళలు.. సిరీస్ ఇంగ్లండ్ వశం..!

India in Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌కు భారత బాక్సర్లు సిద్ధం; పతకాల వేటలో గెలిచేది ఎందరో..?

Abhimanyu Mishra : 12 ఏళ్లకే చెస్‌లో గ్రాండ్ మాస్టర్ అయిన అభిమన్యు మిశ్రా.. అతి చిన్న వయస్కుడిగా గుర్తింపు..

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్ కు ద్యుతి చంద్, శ్రీహరి అర్హత; బోపన్న – దివిజ్ దూరం!

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!