- Telugu News Photo Gallery Sports photos Indian boxers mary kom and other ready for tokyo olympics 2021
India in Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌కు భారత బాక్సర్లు సిద్ధం; పతకాల వేటలో గెలిచేది ఎందరో..?
టోక్యో ఒలింపిక్స్‌కు భారత బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్‌తో సహా ప్రముఖ బాక్సర్లు సన్నద్ధమవుతున్నారు. ప్రాక్టీస్ లో మునిగిన వీరంతా కచ్చితంగా పతకాలను తీసుకొచ్చేందుకు ఆరాటపడుతున్నారు.
Updated on: Jul 01, 2021 | 9:56 AM

India in Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ 2021 లో తమ సత్తా చాటేందుకు భారత బాక్సర్లు సిద్ధంగా ఉన్నారు. కాగా, 2012 లో మేరీ కోమ్, 2008లో విజయేందర్ సింగ్ లు ఇద్దరూ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకాలను అందించారు. అయితే ఈ ఏడాది 13 మంది భారత బాక్సర్లు ఒలింపిక్స్ బరిలో దిగనున్నారు. అయితే ఎంతమంది బరిలో నిలిచి, పతకాలు సాధిస్తారో చూడాలి.

ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత బాక్సర్ మేరీ కోమ్.. భారీ అంచనాలతో బరిలో నిలవనుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన మేరీకోమ్.. 2016 రియో ఒలింపిక్స్‌లో పోటీ చేయలేకపోయింది. దీంతో ఈ ఏడాది మేరీ కోమ్ కచ్చితంగా పతకం సాధిస్తుందని భారతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ అమిత్ పంగల్ బరిలోకి దిగనున్నాడు. అమిత్ ప్రస్తుతం తన గ్రూపులో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. బంగారు పతకం బరిలో అమిత్ కచ్చితంగా ఉంటాడని ఆశిస్తున్నారు. దుబాయ్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అమిత్ రజత పతకం సాధించాడు. 2019 లో బ్యాంకాక్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన అమిత్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

మేరీ కోమ్ తరువాత, పతకం సాధించగల మరో హిళా బాక్సర్ పూజా రాణి. గత ప్రదర్శనల ఆధారంగా కచ్చితంగా పతకం సాధిస్తుందని ఆశపడుతున్నారు. కాగా, ఇటీవల ముగిసిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పూజా బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే.

భారత బాక్సర్ మనీష్ కౌశిక్ కూడా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మనీష్ కాంస్య పతకం సాధించాడు. అలాగే 2018 కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాన్ని కూడా సాధించడంతో.. ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లోనూ పతకం సాధిస్తాడని భావిస్తున్నారు.





























