Abhimanyu Mishra : 12 ఏళ్లకే చెస్‌లో గ్రాండ్ మాస్టర్ అయిన అభిమన్యు మిశ్రా.. అతి చిన్న వయస్కుడిగా గుర్తింపు..

Abhimanyu Mishra : భారతదేశానికి చెందిన అమెరికన్ కుర్రాడు అభిమన్యు మిశ్రా చెస్ చరిత్రలో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయ్యాడు.

Abhimanyu Mishra : 12 ఏళ్లకే చెస్‌లో గ్రాండ్ మాస్టర్ అయిన అభిమన్యు మిశ్రా.. అతి చిన్న వయస్కుడిగా గుర్తింపు..
Abhimanyu Mishra
Follow us
uppula Raju

|

Updated on: Jul 01, 2021 | 9:03 AM

Abhimanyu Mishra : భారతదేశానికి చెందిన అమెరికన్ కుర్రాడు అభిమన్యు మిశ్రా చెస్ చరిత్రలో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఈ సందర్భంగా అతను రష్యన్ గ్రాండ్ మాస్టర్ సెర్గీ కర్జాకిన్ పేరిట 19 సంవత్సరాల క్రితం నమోదు చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. అభిమన్యు మిశ్రా 12 సంవత్సరాల 4 నెలలు 25 రోజుల్లో గ్రాండ్‌మాస్టర్ అయ్యారు. కాగా ఆగస్టు 2002 లో కర్జాకిన్ అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్ అయినప్పుడు, అతనికి 12 సంవత్సరాలు 7 నెలల వయస్సు. అంటే 3 నెలల వయస్సుతో అభిమన్యు రష్యన్ గ్రాండ్ మాస్టర్ పాత రికార్డును బద్దలు కొట్టాడు.

బుడాపెస్ట్‌లో జరిగిన గ్రాండ్‌మాస్టర్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ లియోన్ మెన్డోంకాను ఓడించి అభిమన్యు మిశ్రా ఈ ఘనత సాధించాడు. మొదటగా అభిమన్యు లియోన్‌కు వ్యతిరేకంగా పోరాటం కష్టమని అన్నాడు. కానీ చివరికి అతను చేసిన తప్పు వల్ల నాకు ప్రయోజనం కలిగిందన్నాడు. నేను ఆ తప్పులను బాగా ఉపయోగించుకొని విజయం సాధించానని చెప్పాడు. అభిమన్యు మిశ్రా తండ్రి హేమంత్ అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మీడియాతో జరిగిన ఇంటర్వూలో హేమంత్ ఇలా అన్నారు.

“ఇది మాకు పెద్ద అవకాశం లాంటిదని మాకు తెలుసు. బ్యాక్ టు బ్యాక్ టోర్నమెంట్లలో ఆడటానికి మేము ఏప్రిల్ మొదటి వారంలో బుడాపెస్ట్ చేరుకున్నాము. మా కొడుకు అభిమన్యు అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్ కావాలన్నది నా భార్య స్వాతి కల. ఈ రోజు ఈ కల నెరవేరింది. మా ఆనందాన్ని వర్ణించలేము ” అన్నారు. గ్రాండ్‌మాస్టర్ కావడానికి 100 ELO పాయింట్లు, 3 GM నిబంధనలు అవసరం. అభిమన్యుకు ఇది బాగా తెలుసు. అభిమన్యు ఏప్రిల్‌లో తన మొదటి జీఎం ప్రమాణాన్ని సాధించాడు. రెండో GM ప్రమాణం మేలో సాధించాడు. ఇప్పుడు మూడో GM ప్రమాణాన్ని సాధించడం ద్వారా గ్రాండ్ మాస్టర్ అయ్యాడు.

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్ కు ద్యుతి చంద్, శ్రీహరి అర్హత; బోపన్న – దివిజ్ దూరం!

Tollywood Celebrites birthdays: సోనూసూద్, కళ్యాణ్ రామ్, కృతి సనన్‏తోపాటు జూలైలో పుట్టిన రోజు జరుపుకుంటున్న సెలబ్రెటీలు వీళ్లే….

First Delta Variant Case in Visakha : విశాఖ జిల్లాలో తొలి డెల్టా వేరియంట్ కేసు..! మధురవాడ వాంబే కాలనీ లో 51 యేళ్ల మహిళగా గుర్తింపు..