First Delta Variant Case in Visakha : విశాఖ జిల్లాలో తొలి డెల్టా వేరియంట్ కేసు..! మధురవాడ వాంబే కాలనీ లో 51 యేళ్ల మహిళగా గుర్తింపు..
First Delta Variant Case in Visakha : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో డెల్టా ప్లస్ వేరియంట్ నెమ్మది నెమ్మదిగా
First Delta Variant Case in Visakha : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో డెల్టా ప్లస్ వేరియంట్ నెమ్మది నెమ్మదిగా విస్తరిస్తూ భయాందోళన కలిగిస్తోంది. తాజాగా విశాఖపట్టణం జిల్లాలో తొలి డెల్టా వేరియంట్ కేసు నమోదు అయింది. మధురవాడ వాంబే కాలనీ లో 51 యేళ్ల మహిళకు డెల్టా వేరియంట్ సోకినట్లు గుర్తించారు. ఏప్రిల్ 19న చేసిన కోవిడ్ టెస్ట్ లో రెండోసారి కరోన పాజిటివ్ కి గురయినట్లు గుర్తించి శాంపిల్ ను అధికారులు హైదరాబాద్ కి పంపించారు. దీంతో బుధవారం డెల్టా వేరియంట్ సోకినట్లు రిపోర్ట్స్‌లో తేలింది. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, GVMC అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం బాధిత మహిళ ఆరోగ్యంగానే ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వైద్యాధికారులు డెల్టా ప్లస్ తో పోలిస్తే వేరియంట్ ప్రభావం తక్కువే ఉంటుందని చెబుతున్నారు.
కాగా ఇటీవల డెల్టా వైరస్‌తో తమిళనాడులో తొలి మరణం సంభవించినట్లు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. మదురైకి చెందిన ఓ వ్యక్తి డెల్టా ప్లస్ స్ట్రెయిన్‌తో మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రి ఎమ్‌ఏ సుబ్రమణియన్ తెలిపారు. మదురై రోగి మరణించిన తరువాత నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్ నిర్ధారణ అయినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో డెల్టా ప్లస్ స్ట్రెయిన్ సోకిన వారిలో చెన్నైకి చెందిన ఓ నర్సు, కాంచీపురం జిల్లాకు చెందిన మరొకరు కోలుకున్నట్లు మంత్రి సుబ్రమణియన్ తెలిపారు.ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకూ మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులు నమోదైన రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలను కఠినతరం చేయాలని, అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.