Mahesh Babu-Rajamouli : మహేష్ తో జక్కన మాస్టర్ ప్లాన్.. సూపర్ స్టార్ తో రాజమౌళి అలాంటి స్టోరీ చేయబోతున్నారా..?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ప్రస్తుతం మహేష్ నెంబర్ వన్ గా కంటిన్యూ అవుతున్నాడు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.

Mahesh Babu-Rajamouli : మహేష్ తో జక్కన మాస్టర్ ప్లాన్.. సూపర్ స్టార్ తో రాజమౌళి అలాంటి స్టోరీ చేయబోతున్నారా..?
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 01, 2021 | 7:13 AM

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ప్రస్తుతం మహేష్ నెంబర్ వన్ గా కంటిన్యూ అవుతున్నాడు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలే మహేష్ కు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపధ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దుబాయ్ లో జరిగింది. ఈ సినిమా మహేష్ న్యూ లుక్ లో కనిపించనున్నడు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే మహేష్ తో రాజమౌళి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పైన క్లారిటీ కూడా వచ్చేసింది. మహేష్ తో సినిమా చేయబోతున్నా అని స్వయంగా జక్కనే అనౌన్స్ చేసాడు. అప్పటి నుంచి మహేష్ రాజమౌళి సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నాడా అని ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

మహేష్ తో జేమ్స్ బాండ్ తరహా పాత్రలో చూపించనున్నాడని ఆ మధ్య కొన్ని వార్తలు హల్ చల్ చేసాయి. రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పీరియాడిక్ ఫిల్మ్. గతంలో చేసిన బాహుబలి జానపదం జానర్లో తెరకెక్కించాడు. దాంతో ఇప్పుడు సామాజిక అంశాల పై కమర్షియల్ ఫిల్మ్ రూపొందించే అవకాశం ఎక్కువగా ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ తో సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడట దర్శక ధీరుడు. ఇప్పటికే మహేష్ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయని కూడా అంటున్నారు. మరి మహేష్ ను జక్కన ఎలా చూపించబోతున్నాడో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Rakul Preet Singh: టాలీవుడ్‏ లో బిజీ కానున్న రకుల్.. బాలయ్యకు జోడిగా ఢిల్లీ బ్యూటీ..

Sacrificing Star Sunisith: రంగంలోకి నంద‌మూరి ఫ్యాన్స్.. కాళ్ల‌బేరానికి వ‌చ్చిన సునిశిత్ ..

Anushka Shetty: ఎమోషనల్ మెసేజ్ చేసిన అనుష్క…!! అసలేమైంది…?? ( వీడియో )

ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..
అన్నం లేదా చపాతీ.. ఇందులో ఏది తింటే బరువు తగ్గుతారు?
అన్నం లేదా చపాతీ.. ఇందులో ఏది తింటే బరువు తగ్గుతారు?
అల్లు అర్జున్ నివాసంపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
అల్లు అర్జున్ నివాసంపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి