AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sacrificing Star Sunisith: రంగంలోకి నంద‌మూరి ఫ్యాన్స్.. కాళ్ల‌బేరానికి వ‌చ్చిన సునిశిత్ ..

సునిశిత్.. గ‌త కొద్ది రోజులుగా అటు సోష‌ల్ మీడియాతో పాటు.. ఇటు యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతున్న వ్య‌క్తి. హీరోహీరోయిన్ల‌పై చౌక‌బారు కామెంట్స్ చేయ‌డం....

Sacrificing Star Sunisith: రంగంలోకి నంద‌మూరి ఫ్యాన్స్.. కాళ్ల‌బేరానికి వ‌చ్చిన సునిశిత్ ..
Sunisith
Ram Naramaneni
|

Updated on: Jun 30, 2021 | 8:06 PM

Share

సునిశిత్.. గ‌త కొద్ది రోజులుగా అటు సోష‌ల్ మీడియాతో పాటు.. ఇటు యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతున్న వ్య‌క్తి. హీరోహీరోయిన్ల‌పై చౌక‌బారు కామెంట్స్ చేయ‌డం.. అలా కాస్త జ‌నాల్లో ప‌బ్లిసిటీ తెచ్చుకోవ‌డం ఇత‌డి హాబీ. తాజాగా ఇత‌గాడు దివంగ‌త నందమూరి హరికృష్ణపై కాస్త హ‌ద్దుమీరి సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో నంద‌మూరి ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. తిక్క వేశాలు వేస్తున్న ఈ స్వ‌యం ప్ర‌క‌టిత సాక్రిఫైజింగ్ స్టార్ లెక్క కుదిర్చారు. దీంతో ఇత‌గాడు కాళ్ల బేరానికి వ‌చ్చేశాడు. నన్ను క్షమించండి ఇంకెప్పుడూ అలా చేయను అంటూ ఫేస్ బుక్‌లో వీడియో పెట్టాడు. కేవలం నంద‌మూరి హీరోల జోలికి మాత్ర‌మే కాదు.. ఏ హీరో పైనా కామెంట్ చేయనంటూ చేతులెత్తి మొక్కుతూ చెప్పాడు. దీంతో కాస్త గట్టిగానే త‌గిలించిన‌ట్టు ఉన్నారు అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

‘నేను నందమూరి హరికృష్ణ గారి గురించి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది.. నందమూరి ఫ్యాన్స్ హర్ట్ కావడంతో ఆ పోస్ట్‌ని డిలీట్ చేస్తూ నందమూరి హరికృష్ణ గారికి.. నందమూరి అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇకపై నేను నందమూరి హరికృష్ణ గారినే కాదు.. టాలీవుడ్‌కి సంబంధించిన ఏ హీరో గురించి త‌ప్పుగా మాట్లాడ‌ను.. వారి అభిమానుల‌ను హ‌ర్ట్ చేయ‌ను. ప్రతిఒక్క హీరోకి.. వారి అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అంటూ వీడియో విడుదల చేశాడు సునిశిత్.

ఆ వీడియోను వీక్షించండి…

లావణ్య త్రిపాఠితో నాకు పెళ్తైందంటూ కామెంట్స్ చేయ‌డంతో.. ఆమె అప్ప‌ట్లో సునిశిత్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో అత‌డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అయితే జైలు నుంచి వచ్చిన తరువాత ఇతగాడి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పురాలేదు. తాజాగా నంద‌మూరి అభిమానుల‌ను హ‌ర్ట్ చెయ్య‌డంతో.. వారు త‌మ‌దైన స్టైల్లో ఇత‌గాడిని ట్రాక్‌లోకి తెచ్చారు.

Also Read: ‘వెళ్లి చావండి’ .. స్కూల్ ఫీజులపై మొర పెట్టుకోవడానికి వెళ్లిన పేరెంట్స్‌పై విద్యాశాఖ‌ మంత్రి రుస‌రుస‌లు

వామ్మో..! ఈ తాచుపాము మాముల్ది కాదు.. ఏకంగా 3 అడుగుల కోబ్రాను మింగేసింది.. కానీ

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం