AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: టాలీవుడ్‏ లో బిజీ కానున్న రకుల్.. బాలయ్యకు జోడిగా ఢిల్లీ బ్యూటీ..

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్.. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‏లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

Rakul Preet Singh: టాలీవుడ్‏ లో బిజీ కానున్న రకుల్.. బాలయ్యకు జోడిగా ఢిల్లీ బ్యూటీ..
Rakul Preet Singh
Rajitha Chanti
|

Updated on: Jul 01, 2021 | 6:34 AM

Share

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్.. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‏లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. దాదాపు అందరూ బడా హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది. చిన్న సినిమాతో కెరీర్ ఆరంభించిన రకుల్.. ఆ తర్వాత టాప్ హీరోయిన్ గా మారింది. కేవలం తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్ లో రకుల్ ఇమేజ్ బాగానే ఉందనుకోవాలి. ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొంతకాలంగా తెలుగులో సినిమాల్లో రకుల్ హావా కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇందుకు కారణం.. హిందీలో ఆమెకు స్టార్ హీరోల సినిమా ఆఫర్లు రావడమే అన్నట్లుగా టాక్.

తాజాగా రకుల్ తెలుగు మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ తదుపరి సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉన్నట్లుగా టాక్. ప్రస్తుతం బాలయ్య… బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి.. తన తదుపరి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాలనుకుంటున్నాడట. బాలయ్య అఖండ తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో రకుల్ హీరోయిన్ గా ఎంపిక చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు చిత్రయూనిట్. ఇక గతంలో తనతో ‘డిక్టేటర్’ చేసిన శ్రీవాస్ కి కూడా బాలకృష్ణ ఛాన్స్ ఇచ్చారట. ఈ సినిమాను సి.కల్యాణ్ నిర్మించనున్నాడని అంటున్నారు.

Also Read: Food Oil: సామాన్యులకు భారీ ఊరట.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Gold and Silver Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన పసిడి ధరలు.. అదే బాటలో వెండి ధరలు

Covishield Vaccine: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొవిషీల్డ్‌ రెండో డోసు వ్యవధిని పెంచుతూ నిర్ణయం

Cholesterol Increase: అధిక కొలెస్ట్రాల్‌ ప్రమాదకరం.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచే ఆహారాలు ఇవే..!