Food Oil: సామాన్యులకు భారీ ఊరట.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Food Oil: వంట నూనె ధరలు పెరిగిపోవడంతో సామాన్యులకు తీవ్ర భారంగా మారింది. ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలు, మరో వైపు నిత్యావసరాలు, వంట నూనె ధరలు పెరగడంతో..
Food Oil: వంట నూనె ధరలు పెరిగిపోవడంతో సామాన్యులకు తీవ్ర భారంగా మారింది. ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలు, మరో వైపు నిత్యావసరాలు, వంట నూనె ధరలు పెరగడంతో సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వంట నూనె ధరలు తగ్గించాలని కొన్ని రోజుల నుంచి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. క్రూడ్ పామ్ ఆయిల్ పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో కోత విధించింది. 10 శాతానికి తగ్గించింది. దీంతో రిలైల్ మార్కెట్‌లో వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. మోదీ ప్రభుత్వం తాజా నిర్ణయంతో క్రూడ్ పామ్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10 శాతానికి తగ్గింది. అలాగే రిఫైన్డ్ పామ్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 37.5 శాతానికి దిగి వచ్చింది.
బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు నిర్ణయం బుధవారం నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది వరకు క్రూడ్ పామ్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతంంగా ఉండేది. ఇతర పామ్ ఆయిల్ కేటగిరిపై ఇది 45 శాతంగా కొనసాగేది. సామాన్యులకు ఊరట కలిగించేందుకు కేంద్ర కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామ్‌ఆయిల్‌పైన కస్టమ్స్ డ్యూటీని 35.75 శాతం నుంచి 30.25 శాతానికి తగ్గింది. అలాగే రిఫైన్డ్ పామ్ ఆయిల్‌పైన 49.5 శాతం నుంచి 41.25 శాతానికి తగ్గించింది. దీంతో వంట నూనె ధరలు దిగిరానున్నాయని సీబీఐసీ వెల్లడించింది.
To give relief to people, the Government has reduced customs duty on crude palm oil from 35.75% to 30.25% and refined palm oil from 49.5% to 41.25%. This will bring down the retail prices of edible oils in the market.@nsitharaman @ianuragthakur @FinMinIndia @PIB_India
— CBIC (@cbic_india) June 29, 2021