Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్న వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్త సర్వీసు ప్రారంభం..!
మీకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఉంటే శుభవార్తే. కంపెనీ తాజాగా కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. సరికొత్త సర్వీస్ ప్యాకేజ్‌ని ఆవిష్కరించింది. ఇందులో ..
Updated on: Jun 30, 2021 | 5:42 AM

Royal Enfield: మీకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఉంటే శుభవార్తే. కంపెనీ తాజాగా కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. సరికొత్త సర్వీస్ ప్యాకేజ్‌ని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడిపే వారు ఒకసారి ఉచితంగానే ఫ్రీ సర్వీస్ పొందవచ్చు.

సర్వీస్ కేర్ 24 పేరుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ కొత్త సర్వీస్ ప్యాకేజ్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇందులో నాలుగు సాధారణ సర్వీసులు ఉంటాయి. అలాగే రెండు సార్లు ఇంజిన్ ఆయిల్ మార్చుకోవచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఉన్న వారికి మొదటి సర్వీస్ ఉచితంగానే లభిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ సర్వీస్ ప్యాకేజీ ధర రూ.రూ.2,499. అన్ని ట్యాక్స్‌లు కలుపుకొనే ఈ ధర నిర్ణయించారు. ఈ ప్యాకేజ్ తీసుకున్న వారికి అదనపు రిపేర్ అవసరం అయితే విడిభాగాలపై, లూబ్రికేషన్‌పై 5 శాతం డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అలాగే లేబర్ చార్జీల్లో 20 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

అలాగే మోటార్‌సైకిల్ ఛాసిస్ నెంబర్ వెరిఫికేషన్ తర్వాతనే ఈ సర్వీస్ ప్యాకేజ్ అందిస్తారు. ఈ సర్వీస్ ప్యాకేజ్ కొనుగోలు చేయాలని భావించే వారు రాయల్ ఎన్‌ఫీల్డ్ వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్యాకేజీని కొనుగోలు చేయవచ్చు.





























