RBI: అవుట్ సోర్సింగ్ పాలసీపై మార్గదర్శకాలను విడుదల చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
RBI: కీలకమైన నిర్వహణ సేవలను అవుట్‌సోర్స్ చేయరాదంటూ కోఆపరేటివ్ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది. కోఆపరేటివ్ బ్యాంకులు ఆర్థిక.
RBI: కీలకమైన నిర్వహణ సేవలను అవుట్‌సోర్స్ చేయరాదంటూ కోఆపరేటివ్ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది. కోఆపరేటివ్ బ్యాంకులు ఆర్థిక సేవలను అవుట్ సోర్స్ చేసుకోవచ్చని తెలిపింది. కానీ కీలక నిర్వహణ విధులైన విధానాల రూపకల్పన, ఇంటర్నల్ ఆడిట్, నిబంధనల అమలు, కేవైసీ నిబంధనల అమలు, రుణాల మంజూరు, పెట్టుబడుల నిర్వహణ సేవలను ఇతరులకు అప్పగించ్చవద్దని ఆర్బీఐ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కోఆపరేటివ్ బ్యాంకులు ఆర్థిక సేవలను అవుట్ సోర్స్ చేసే విషయంలో రిస్క్ నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. రిస్క్ పర్యవేక్షణ కోసం మాజీ ఉద్యోగులను నిబంధనల మేరకు నియమించుకోవడానికి అవకాశం కల్పించింది. వ్యయాలను తగ్గించుకునేందుకు, నిపుణుల సేవలను పొందేందుకు కోపరేటివ్ బ్యాంకులు పలు కార్యకలాపాలను అవుట్‌సోర్స్ ఇస్తుంటాయి. అయితే ఇలా సేవలను వేరే వారికి అప్పగించే విషయంలో వచ్చే సమస్యలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు నిబంధనలను అందుబాటులోకి తీసుకొచ్చింది.