DOOSRA: సిమ్‌ కార్డు లేకుండానే ఫోన్‌ కాల్స్‌.. రాంగ్ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు కొత్త యాప్‌ను సృష్టించిన హైదరాబాది

DOOSRA: సాధారణంగా మన ఫోల్‌కు రాంగ్‌ కాల్స్‌ అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇక కొందరేమో సైబర్‌ నేరాలకు పాల్పడేందుకు కాల్స్‌ చేస్తుంటారు. అలాంటి రాంగ్‌ కాల్స్‌కు చెక్‌..

DOOSRA: సిమ్‌ కార్డు లేకుండానే ఫోన్‌ కాల్స్‌.. రాంగ్ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు కొత్త యాప్‌ను సృష్టించిన హైదరాబాది
Doosra App
Follow us
Subhash Goud

|

Updated on: Jun 28, 2021 | 8:06 AM

DOOSRA: సాధారణంగా మన ఫోల్‌కు రాంగ్‌ కాల్స్‌ అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇక కొందరేమో సైబర్‌ నేరాలకు పాల్పడేందుకు కాల్స్‌ చేస్తుంటారు. అలాంటి రాంగ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టే విధానం వచ్చేసింది. మన వ్యక్తిగత ఫోన్‌ నెంబర్లు సైబర్‌ నేరగాళ్లకు వెళ్తుండటం, అలాగే మనం పలు యాప్‌లను వినియోగిస్తున్న క్రమంలో మన మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వల్ల మన నెంబర్‌లు అపరిచితులు, సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుండటంతో అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. మనకు తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు రావడం సాధారణంగా మారిపోయింది. ఆ ఫోన్లను లిఫ్ట్‌ చేయకుండా ఉందామంటే ఎవరు చేస్తున్నారో తెలియదు? ఒకవేళ లిఫ్ట్‌ చేస్తే మరో సమస్య. ఇలాంటి రాంగ్‌కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన టెకీ అనిల్‌ ఆదిత్య దూస్ర యాప్‌నకు రూపకల్పన చేశాడు. ప్రస్తుతం ఇది గుగూల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

సిమ్‌ లేకుండానే ఫోన్‌ కాల్స్‌..

కాగా, ఎవరైనా సరే మొదటగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన వివరాలను, వ్యక్తిగత ఫోన్‌నెంబర్‌ అందులో నమోదు చేసుకోవాలి. అనంతరం మనకు వర్చువల్‌ బేస్ట్‌ 10 అంకెల నెంబర్‌ అలాట్‌ అవుతుంది. ఆ నంబర్‌ను మనం ఫోన్‌ నంబర్‌లాగానే వినియోగించుకోవచ్చు. ఎవరికైనా ఇవ్వవచ్చు. ఇక ఇది ఎలా పనిచేస్తుంటే మన సిమ్‌ కార్డులో ఉన్న నంబర్స్‌ నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను మినహా మరే తెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ కాల్స్‌ను ఇది అనుమతించదు. అవన్నీ దూస్ర యాప్‌ అలాట్‌ చేసిన నెంబర్‌కు వాయిస్‌ మెసేజ్‌లుగా షిఫ్ట్‌ అవుతాయి. ఇక కాల్స్‌ను రిసీవ్‌ చేసుకోవడం, మేనేజ్‌ చేసుకోవడం అన్నింటినీ యాప్‌ ద్వారానే చేసుకునే సదుపాయం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మన వ్యక్తిగత నెంబర్‌ను ఎక్కడా ఎవరికీ ఇవ్వకుండా అన్నింటికీ దూస్ర యాప్‌ అలాట్‌ చేసిన నంబర్‌నే ఇచ్చి వినియోగించుకోవచ్చు.

కొవిడ్‌ వారియర్లకు మాత్రమే ఉచితం..

అయితే ఒక్క విషయం ఏంటంటే.. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి వినియోగించుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండు విధాలా ఆఫర్లను యాప్‌ నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. దూస్ర ఎసెన్షియల్‌ పేరిట ఒక ఆఫర్‌ను, దూస్ర ప్రో పేరిట రెండు ప్యాకేజీలను అందిస్తున్నారు. మొదటి ప్యాకేజీలో భాగంగా సంవత్సరానికి రూ.699, రెండవ ప్యాకేజీని పొందాలంటే రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఇక యాప్‌ నిర్వాహకులు కొవిడ్‌ వారియర్లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సేవ చేస్తున్నవారికి ఆఫర్‌ను ప్రకటించాయి. అది కూడా 6 నెలల మాత్రమే.

యాప్‌ను ఇటీవల కాలంలో ఆవిష్కరించామని, ఇప్పటికే స్విగ్గీ, జొమాటో తదితర బహుళజాతి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని దూస్రయాప్‌ సీఈవో అనిల్‌ ఆదిత్య చెబుతున్నారు. ఈ యాప్‌ వల్ల మహిళలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. రాంగ్‌ కాల్స్‌ రాకుండా నిరోధించుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Realme Narzo 30 Features: రియ‌ల్‌మీ నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫోన్‌.. ఆక‌ట్టుకుంటోన్న‌ ఫీచ‌ర్ల‌పై మీరూ ఓ లుక్కేయండి..

AC: మీరు కొత్త ఏసీ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? నెలకు రూ.1749 కడితే చాలు.. ఏసీ మీ సొంతం