WhatsApp: థర్డ్ పార్టీ యాప్‌లను వాడుతున్నారా.. అయితే మీ వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయ్యే అవకాశముంది!
థర్డ్ పార్టీ రూపొందించిన అప్లికేషన్స్ ఉపయోగిస్తే వెంటనే అధికారిక వాట్సప్ యాప్‌నకు మారాలి, లేదంటే మీ వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయ్యే ప్రమాదం ఉంది.
WhatsApp: థర్డ్ పార్టీ రూపొందించిన అప్లికేషన్స్ ఉపయోగిస్తే వెంటనే అధికారిక వాట్సప్ యాప్‌నకు మారాలి, లేదంటే మీ వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ మేరకు వాట్సప్ యూజర్లను హెచ్చరించింది. థర్డ్ పార్టీ యాప్‌లను అసలు వాట్సప్ సపోర్ట్ చేయదని, అలాంటి వాటిని వాట్సప్ ఎట్టి పరిస్థితుల్లో ఓకే చేయదని గుర్తుచేసింది. టెంపరర్‌లీ బ్యాన్‌డ్ అంటూ ఏదైనా మెసేజ్ వస్తే.. అది థర్డ్ పార్టీ యాప్‌గానే పరిగణించాలని హెచ్చరించింది. అన్‌పపోర్డేడ్ వెర్షన్‌గా పరిగణించాలని యూజర్లను కోరింది. ఒరిజినల్ వాట్సప్ యాప్ నుంచి అలాంటి మెసేజ్‌లు రావని గుర్తుంచుకోవాలని సూచించింది. తాత్కాలిక బ్యాన్ తరువాత ఒరిజినల్ వాట్సప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అధికారిక అకౌంట్‌లో లాగిన్ కావాలని పేర్కొంది. లేదంటే సంబంధిత అకౌంట్‌లు శాశ్వతంగా మూతపడతాయని వెల్లడించింది. మీ ఛాటింగ్ వివరాలను ఫోన్ల ద్వారా పంపాలని అడిగితే అవి నకిలీవని గుర్తించాలని, వాట్సాప్ ప్లస్, జీబీ వాట్సాప్ తోపాటు ఇతర యాప్స్ ఏవైనా థర్డ్ పార్టీ నుంచి వచ్చినవేని పేర్కొంది. వీటికి ఒరిజినల్ వాట్పప్‌నకు ఎటువంటి సంబంధం లేదని వెల్లడించింది. మా రూల్స్‌ను థర్డ్ పార్టీ యాప్‌లు ఉల్లంఘించాయని వాట్సాప్ పేర్కొంది.
థర్డ్ పార్టీ యాప్‌లను అస్సలు వాడొద్దని, ఒకవేళ పొరపాటున ఎవరైన వాడితే త్వరగా ఒరిజినల్ వాట్సప్‌నకు మారాలని సూచించింది. లేదంటే మీ అకౌంట్ శాశ్వతంగా బ్యాన్ అయ్యే ప్రమాదం ఉంది. ఒరిజినల్ వాట్సాప్ నకు మారాలనుకుంటే ముందుగా ఛాటింగ్ హిస్టరీని బ్యాకప్ చేసుకోవాలి. ఆ తరువాత మీ ఫోన్‌లో ఎలాంటి యాప్‌ను యూజ్ చేస్తున్నారో చెక్ చేసుకోవాలి. ఇందు కోసం సెట్టింగ్స్– హెల్ప్–యాప్ ఇన్ఫో పై క్లిక్ చేయాలి. అక్కడ యాప్ వివరాలు లభిస్తాయి. ఒకవేళ అనధికార యాప్‌లు అనిపిస్తే.. ఛాట్ హిస్టరీని బ్యాక్ చేసుకుని, ఒరిజినల్ వాట్స్‌ప్‌నకు మారాలి. ఇలామారేటప్పుడు బ్యాకప్ చేసుకున్న ఛాట్ హిస్టరీని పొందవచ్చు, లేక ఫెయిల్ అవ్వొచ్చని వాట్సప్ తెలిపింది.
WhatsApp Plus, GB WhatsApp లాంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడొద్దని యూజర్లను కోరింది. మీ అకౌంట్ బ్యాన్ కాకుండా ఉండాలంటే మాత్రం అఫీషియల్ వాట్సప్ యాప్ మాత్రమే ఉపయోగించాలని సూచించింది. అయితే ఆయా థర్డ్ పార్టీలు తమ రూల్స్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని తెలిపింది. వాటిలో సెక్యూరిటీ ఎలా ఉంటుందో కూడా తమకు తెలియదని, ఇకపై వాట్సప్ ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్‌ని సపోర్ట్ చేయదని పేర్కొంది.
Also Read:
Realme 5G Phone: రూ.7 వేలకే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేయనున్న రియల్‌మీ.. ఎప్పుడంటే?
Poco x3 GT: విడుదలకు ముందే లీకైన పోకో ఎక్స్3 జీటీ ఫీచర్లు..!