Tide Astronauts Clothes: అంతరిక్షంలోకి టైడ్ డిటర్జెంట్.. వ్యోమగాములను కూడా అవాక్యయేలా చేయనున్నారు..
Tide Astronauts Clothes: అంతరిక్షంలో ఏళ్ల పాటు ఉండే వ్యోమగాములు తమ దుస్తులను ఎలా ఉతుక్కుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? అంతరిక్షంలో నీటి కొరత కారణంగా.. స్పేస్ స్టేషన్‌లో ఉండే వ్యోమగాములు తాము ధరించిన దుస్తులను...
Tide Astronauts Clothes: అంతరిక్షంలో ఏళ్ల పాటు ఉండే వ్యోమగాములు తమ దుస్తులను ఎలా ఉతుక్కుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? అంతరిక్షంలో నీటి కొరత కారణంగా.. స్పేస్ స్టేషన్‌లో ఉండే వ్యోమగాములు తాము ధరించిన దుస్తులను ఉతకరు. ఉపయోగించినన్ని రోజులు ఉపయోగించి తర్వాత మురికి ఎక్కవైతే అంతరిరక్షంలోకి వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల.. భారీ ఎత్తున దుస్తులు వృథా అవుతాయి. ఇక సాధారణ డిటర్జెంట్‌తో దుస్తులను శుభ్రం చేసుకోవాలంటే నీరు ఎక్కువగా అవసరమవుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే నాసా ఓ కీలక అడుగు వేసింది.
అవాక్కయ్యారా..! అంటూ ప్రకటనలతో ఆకట్టుకునే టైడ్ డిటర్జెంట్ ఇకపై అంతరిక్షంలోని వ్యోవగాములను సైతం అవాక్కయేలా చేయనుంది. అసలు విషయం ఏంటంటే.. టైడ్ డిటర్జెంట్‌ను తయారు చేస్తోన్న ప్రోక్టర్ అండ్ గాంబుల్(పీ అండ్ జీ) కంపెనీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో కీలక ఒప్పందం చేసుకుంది. తక్కువ నీటితో దుస్తులను ఉతుక్కునేలా పీ అండ్ జీ కంపెనీ కొత్త డిటర్జెంట్‌ను తయారు చేసే పనిలో పడింది. ఇక గురుత్వాకర్షణలేని ప్రదేశంలో డిటర్జెంట్ ఏవిధంగా పని చేస్తాయో విషయంపై నాసా శాస్త్రవేత్తలు పరిశోధించనున్నారు. ఇదిలా ఉంటే.. నాసా తర్వలోనే అంగారక గ్రహంపైకి మానవసహిత అంతరిక్షనౌకలను ప్రయోగించాలని చూస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రోనాట్స్ ఎక్కువ కాలంపాటు అంతరిక్షంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో దుస్తులను తీసుకెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి.. స్పేస్‌లో ఉపయోగించేందుకు వీలుండే డిటర్జెంట్ తయారీకోసం నాసా.. పీ అండ్ జీతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.