Realme 5G Phone: రూ.7 వేలకే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంఛ్ చేయనున్న రియల్‌మీ.. ఎప్పుడంటే?

Venkata Chari

Venkata Chari |

Updated on: Jun 27, 2021 | 3:03 PM

రియల్‌ మీ సంస్థ రూ. 7వేల లోపే 5జీ ఫోన్ విడుదల చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా 5జీ ఫోన్‌ను విడుదల చేస్తామని రియల్‌మీ ఇండియా సీఈఓ సీఈవో మాధవ్ సేథ్ తెలిపారు.

Realme 5G Phone: రూ.7 వేలకే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంఛ్ చేయనున్న రియల్‌మీ.. ఎప్పుడంటే?
Realme New 5g Phone Under 7000

Realme 5G Phone: రియల్‌ మీ సంస్థ రూ. 7వేల లోపే 5జీ ఫోన్ విడుదల చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా 5జీ ఫోన్‌ను విడుదల చేస్తామని రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ తెలిపారు. ఏకంగా 60 లక్షల ఫోన్లు తీసుకరానున్నట్లు ప్రకటించారు. గత వారమే రియల్‌మీ భారత మార్కెట్‌లోకి రెండు ఫోన్లు రియల్ మీ నార్జో 30 5 జీ, రియల్‌ మీ నార్జో 30 విడుదల చేసింది. వీటితో పాటు రియల్‌ మీ బడ్స్ క్యూ 2, రియల్‌ మీ స్మార్ట్ టీవీ 32 ఫుల్-హెచ్‌డీ లను విడుదల చేసింది. రానున్న రోజుల్లో భారత మార్కెట్‌ బలమైన ముద్ర వేసేందుకు అడుగులు వేస్తోంది. తాజాగా విడుదలైన ఈ ఫోన్లు రూ. 12,499 నుంచి రూ.15,999 మధ్యలో ఉన్నాయి. ఈ ఫోన్లు జూన్ 29 నుంచి సేల్ కు రానున్నాయని సంస్థ ప్రకటించింది.

రాబోయే 5జీ ఫోన్‌ ను మాత్రం రూ.7వేల లోపే అందిచనుండడం విశేషం. గ్లోబల్‌ 5జీ సమ్మిట్‌ వేదికగా ఈప్రకటన చేశారు. ” ఓ సర్వే మేరకు ఇండియాలో ఎక్కువ మంది 5జీ టెక్నాలజీ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అందరికి కంటే ముందుగా తక్కువ ధరలో 5జీ ఫోన్‌ తీసుకొస్తాం. ఓ కొత్త ట్రెండ్‌ను క్రియోట్ చేస్తాం. అన్ని ఫీచర్లతో ఇతర సంస్థల కంటే ముందుగా మంచి క్వాలిటీతో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకోస్తాం. ఈ లక్ష్యంతోనే ప్రస్తుతం పనిచేస్తున్నాం” అని రియల్‌ మీ సీఈవో మాధవ్ సేథ్ పేర్కొన్నారు.

అయితే ఇప్పటికే ల్యాప్‌టాప్‌లతోపాటు, ట్యాబ్‌ల రంగంలోకి కూడా రియమల్‌మీ ప్రవేశించింది. ఈ ఏడాది చివరికల్లా విండోస్ 11తో సరికొత్త ల్యాప్‌టాప్‌ను మార్కెట్‌లోకి తీసుకోస్తామని ప్రకటించిన సంతగి తెలిసిందే. అయితే ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా సేల్స్‌ కోసం సరికొత్త స్ట్రాటజీతో మార్కెట్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్ స్పీకర్లను విడుదల చేసేందుకు రియల్‌ మీ రెడీ అయింది. ఆ ఐదు వస‍్తువుల్నికొంటే ఒక ఫోన్‌ను ఉచితంగా అందించనున్నట్లు వార్తుల వినిపిస్తున్నాయి. వీటితో పాటు రియల్‌మీకి చెందిన గేమ్ కన్సోల్స్‌, కంప్యూటర్ మౌస్‌లు, వాక్యూమ్ క్లీనర్స్, స్కేల్స్, టూత్ బ్రష్లు, సాకెట్లు, బల్బులు, కెమెరాలను కూడా మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:

Google New Tool: వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసే అయితే వారి జీతాల్లో మార్పు… ( వీడియో )

Poco x3 GT: విడుదలకు ముందే లీకైన పోకో ఎక్స్3 జీటీ ఫీచర్లు..!

Skoda Kushaq: జూన్‌ 28 నుంచి స్కోడా కుషాక్ బుకింగ్‌లు; డెలివరీలు ఎప్పుడంటే..?

Realme Laptop with Windows 11: విండోస్ 11 తో రానున్న రియల్‌మీ ల్యాప్‌టాప్..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu