AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme Laptop with Windows 11: విండోస్ 11 తో రానున్న రియల్‌మీ ల్యాప్‌టాప్..!

రియల్‌మీ.. ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ల తయారీ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు టీజ్ చేసింది. త్వరలో విడుదల చేసే ల్యాప్‌టాప్ మైక్రోసాఫ్ట్ తాజా ఓస్ విండోస్ 11తో రానున్నట్లు ప్రకటించింది.

Realme Laptop with Windows 11: విండోస్ 11 తో రానున్న రియల్‌మీ ల్యాప్‌టాప్..!
Realme Laptop With Windows 11
Venkata Chari
|

Updated on: Jun 26, 2021 | 1:54 PM

Share

Realme Laptop with Windows 11: రియల్‌మీ సంస్థ తన ఉత్పత్తులను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మొబైల్స్, స్మార్ట్‌ టీవీలు లాంటి ఉత్పత్తులను తయారుచేస్తోంది. తాజాగా ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ల తయారీ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు టీజ్ చేసింది. త్వరలో విడుదల చేసే ల్యాప్‌టాప్ మైక్రోసాఫ్ట్ తాజా ఓస్ విండోస్ 11తో రానున్నట్లు ప్రకటించింది. విండోస్ 11 అధికారికంగా అనౌన్స్ చేసిన తరువాత రోజే రియల్‌మీ ఇలాంటి ప్రకటన విడుదల చేసింది. త్వరలో జరగబోయే రియల్ మీ జీటీ గ్లోబల్ లాంచ్ ఈవెంట్లో వీటిని విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. వీటిలో రియల్‌మీ బుక్, రియల్‌మీ ప్యాడ్ ఉండనున్నట్లు తెలిపింది. రియల్‌మీ విడుదల చేయబోయే రెండు ప్రోడక్ట్స్‌..కంపెనీకి మొదటి ఉత్పత్తులే కావడం విశేషం. ఈ ఏడాదే ల్యాప్‌టాప్ లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈమేరకు రియల్‌మీ టెక్‌లైఫ్ ట్వీట్ చేసింది. ఇందులో ఓ టీజర్ మేరకు.. రియల్‌మీ కొత్త ల్యాప్‌టాప్ విండోస్ 11 తో పనిచేయనుంది. అని రాసుకొచ్చింది. ఈ రెండు ప్రొడక్ట్స్‌ గురించి ఇతర వివరాలు, స్పెషిఫికేషన్‌లు విడుదల కాలేదు. త్వరలోనే ఈ వివరాలతో కూడిన టీజర్లు విడుదల కానున్నట్లు సమాచారం. ఈ ప్రోడక్టుల డిజైన్లు ఇప్పటికే సిద్ధమైనట్లు, తయారీలో సంస్థ బిజీగా ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే, ఇప్పటికే లీకైన వివరాల మేరకు యాపిల్ మ్యాక్‌బుక్ తరహాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. సిల్వర్ ఫినిష్, అల్యూమినియం బిల్డ్‌తో డిజైన్లు రెడీ అయ్యాయని, రియల్ మీ లోగో ఉందని టిప్‌స్టర్‌లు పేర్కొన్నారు. డ్యూయల్ స్పీకర్స్ తో ఈ ల్యాప్‌టాప్‌లు రానున్నాయని తెలుస్తోంది. ల్యాప్‌టాప్ కూలింగ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్టుతోపాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా రియల్‌మీ ల్యాప్ టాప్‌లో అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం మరిన్ని రోజులు ఆగాల్సింది.

కాగా, గత వారమే రియల్‌మీ భారత మార్కెట్‌లోకి రెండు ఫోన్లు రియల్ మీ నార్జో 30 5 జీ, రియల్‌ మీ నార్జో 30 విడుదల చేసింది. వీటితో పాటు రియల్‌ మీ బడ్స్ క్యూ 2, రియల్‌ మీ స్మార్ట్ టీవీ 32 ఫుల్-హెచ్‌డీ లను విడుదల చేసింది. రానున్న రోజుల్లో భారత మార్కెట్‌ బలమైన ముద్ర వేసేందుకు అడుగులు వేస్తోంది. తాజాగా విడుదలైన ఈ ఫోన్లు రూ. 12,499 నుంచి రూ.15,999 మధ్యలో ఉన్నాయి. ఈ ఫోన్లు జూన్ 29 నుంచి సేల్ కు రానున్నాయని సంస్థ ప్రకటించింది.

Also Read:

Realme Narzo: భారత మార్కెట్‌లోకి విడుదలైన రియల్‌ మీ ఫోన్లు; ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Lava Benco 80: బెంకోతో చేతులు క‌లిపిన లావా.. వి80 పేరుతో కొత్త ఫోన్ లాంచ్.. త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ ఫీచ‌ర్లు.

Vivo V21e 5G: వివో నుంచి కొత్త 5జీ ఫోన్‌ విడుదల; ధర రూ.25 వేలలోపే!

Windows 11: ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన విండోస్‌ 11; అందుబాటులోకి ఎప్పుడంటే..?