- Telugu News Photo Gallery Technology photos Hong kong based smartphone company techno released new smart phone called tecno phantom x have a look on features
Techno Phantom X: మార్కెట్లోకి టెక్నో కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఈ ఫోన్ సొంతం..
Techno Phantom X: హాంగ్‌కాంగ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ టెక్నో.. తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. టెక్నో ఫాంటమ్ ఎక్స్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను జోడించారు. మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Jun 26, 2021 | 3:31 PM

స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ కారణంగా రోజుకో కంపెనీ అధునాతన ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే హాంగ్‌కాంగ్‌కు చెందిన టెక్నో బ్రాండ్ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది.

6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిజల్యూషన్ 1,080x2,400 పిక్సెల్స్‌గా ఉంది.

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

కెమెరా విషయానికొస్తే 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 48 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ముందువైపు రెండు కెమెరాలు ఉండడం ఈ ఫోన్ మరో ప్రత్యేకత.

4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ సొంతం. ఇక ఈ ఫోన్ ధరను కంపెనీ మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించనుంది.





























