- Telugu News Photo Gallery Technology photos Realme launches in 32 inches smart tv with high end features with low price sale begins from june 29th
Realme Smart TV: భారత్‌లో కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన రియల్‌మీ.. ప్రారంభ ఆఫర్ కింద రూ. 17,999 కే..
Realme Smart TV: భారత మార్కెట్లో సత్తా చాటుతోన్న రియల్ మీ తాజాగా కొత్తగా మరో స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్లతో కూడిన ఈ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీని ఈ నెల 29 నుంచి అందుబాటులోకి రానుంది..
Updated on: Jun 25, 2021 | 3:45 PM

స్మార్ట్ ఫోన్ రంగంలో పెను సంచలనంగా దూసుకొచ్చిన రియల్‌మీ.. తాజాగా స్మార్ట్ టీవీల తయారీలోనూ తన హవాను చాటుతోంది. సరికొత్త ఫీచర్లతో కూడిన టీవలను లాంచ్ చేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా భారత్‌లో కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసిందీ కంపెనీ. 32 ఇంచెస్ స్క్రీన్‌తో రూపొందించిన ఈ స్మార్ట్ టీవీ రిజల్యూషన్ 1,920x1,080 పిక్సెల్స్‌గా ఉంది.

24W సౌండ్ అవుట్‌పుట్, డాల్బీ ఆడియో సపోర్ట్ ఈ స్మార్ట్ టీవీ సొంతం. అంతేకాకుండా హెచ్‌డీఆర్ ఫార్మాట్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

ఇన్ని ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ టీవీని రియల్‌మీ కేవలం రూ. 18,999కే తీసుకొచ్చింది. ఇక ప్రారంభ ఆఫర్ కింద రూ. వెయ్యి తక్కువగా రూ. 17,999కే అందుబాటులోకి రానుంది. జూన్ 29 నుంది సేల్ అందుబాటులోకి రానుంది.

రియల్‌మీ స్మార్ట్ టీవీ ఫుల్ హెచ్‌డీ పేరుతో లాంచ్ చేసిన ఈ టీవీ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.

ఈ స్మార్ట్ టీవీలో గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా.. గూగుల్ ప్లేస్టోర్‌కు యాక్సెస్, ప్రముఖ స్ట్రీమింగ్ యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇందులో అందించారు.





























