- Telugu News Photo Gallery Technology photos Indian mobile company lava join hands with benco released lava benco v80 smartphone features and price details about phone
Lava Benco 80: బెంకోతో చేతులు కలిపిన లావా.. వి80 పేరుతో కొత్త ఫోన్ లాంచ్.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు.
Lava Benco 80: ఇండియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లెనెవో, బెంకో అనే కంపెనీతో కలిసి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. లావా బెంకో వి 80 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తక్కువ ధరలో తీసుకొచ్చారు. ఈ ఫోన్ ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి..
Updated on: Jun 24, 2021 | 4:10 PM

భారత్‌కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా.. బెంకో కంపెనీతో చేతులు కలిపి కొత్త ఫోన్‌ను రూపొందించింది. లావా బెంకో వి80 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను థాయ్‌లాండ్‌లో తాజాగా విడుదల చేశారు.

ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర థాయ్‌లాండ్ కరెన్సీలో 2,890 బట్‌గా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 6,300 ఉంది.

200 గ్రాముల కన్నా తక్కువ బరువుతో ఈ ఫోన్‌ను రూపొందించారు. ఇక సెక్యూరిటీలో భాగంగా ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే విషయానికొస్తే.. 6.51 అంగుళాల హెచ్‌డి+ రిజల్యూషన్‌తో అందించారు. 8 మెగాపిక్సెల్ కెమెరా దీని సొంతం.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. 4జీబీ ర్యామ్‌తో పాటు 64 జీబీ స్టోరేజ్ అందించారు. ఎస్‌డీ కార్డును కూడా సపోర్ట్ చేస్తుంది.

5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, యునిసోక్ ఎస్‌సీ 9863 ప్రాసెసర్ ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్‌ను భారత్‌ను త్వరలోనేలాంచ్ చేయనున్నారు.





























