Realme Narzo: భారత మార్కెట్‌లోకి విడుదలైన రియల్‌ మీ ఫోన్లు; ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

రియల్‌ మీ నుంచి నూతన స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్‌లోకి విడుదల అయ్యాయి. ఈ రోజు నిర్వహించిన ఓ కార్యక్రమంలో రెండు నూతన ఫోన్లను విడుదల చేసింది. వీటిలో నార్జో 30 5 జీ, రియల్‌ మీ నార్జో 30 ఫోన్‌లు ఉన్నాయి.

Realme Narzo: భారత మార్కెట్‌లోకి విడుదలైన రియల్‌ మీ ఫోన్లు; ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Realme Narzo 30 5g And Realme Narzo 30
Follow us
Venkata Chari

|

Updated on: Jun 24, 2021 | 3:20 PM

Realme Narzo: రియల్‌ మీ నుంచి నూతన స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్‌లోకి విడుదల అయ్యాయి. ఈ రోజు నిర్వహించిన ఓ కార్యక్రమంలో రెండు నూతన ఫోన్లను విడుదల చేసింది. వీటిలో నార్జో 30 5 జీ, రియల్‌ మీ నార్జో 30 ఫోన్‌లు ఉన్నాయి. అయితే ఈ రెండు ఫోన్లు కొన్ని నెలల క్రితం గ్లోబల్ మార్కెట్ లో విడుదలయ్యాయి. నేడు ఇండియాలో లాంచ్ చేసింది రియల్‌మీ సంస్థ. అలాగే వీటితో పాటు రియల్‌ మీ బడ్స్ క్యూ 2, రియల్‌ మీ స్మార్ట్ టీవీ 32 ఫుల్-హెచ్‌డీ లను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్‌లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. అలాగే ఈ ఫోన్‌లలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుకాల ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి.

రియల్ మీ నార్జో 30 5 జీ, రియల్‌ మీ నార్జో 30 ధర, సేల్ వివరాలు కొత్త రియల్‌మీ నార్జో 30 5 జీ మనదేశంలో రూ. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ మోడల్‌ ధర రూ. 15,999 గా ఉంది. అలాగే రియల్‌మీ నార్జో 30 4 జీబీ ర్యామ్ + 64 జీబీ వేరియంట్ ధర రూ. 12,499లుగా ఉంది. అలాగే దీనిలో మరో వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ మోడల్‌ ధర రూ. 14,499లుగా ఉంది. రియల్‌మీ నార్జో 30 5 జీ, రియల్‌ మీ నార్జో 30 ఫోన్లు రేసింగ్ బ్లూ, రేసింగ్ సిల్వర్ అనే రెండు కలర్లలో లభిస్తున్నాయి.

రియల్‌మీ నార్జో 30 5 జీ మనదేశంలో జూన్ 30 నుంచి సేల్‌కు రానున్నాయి. తొలిసారి సేల్‌కు వస్తున్న సందర్భంగా రూ. 500 తగ్గింపు ఇవ్వనుంది. అంటే రూ. 15,499 ధరకు ఈ ఫోన్ లభించనుంది. మరోవైపు రియల్‌మీ నార్జో 30 జూన్ 29 నుంచి సేల్‌కు రానుందని సంస్థ ప్రకటించింది. ఈ ఫోన్‌ కూడా ప్రారంభ ఆఫర్ కింద 4జీబీ ర్యామ్ + 64 జీబీ మోడల్ రూ. 500 తగ్గింపుతో లభిస్తోంది. రెండు ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్, రియల్‌.కామ్‌తో పాటు ఆఫ్‌లైన్ లో కూడా అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.

రియల్‌ మీ నార్జో 30 5 జీ స్పెసిఫికేషన్లు రియల్‌మీ నార్జో 30 5 జీ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే రియల్‌మీ యూఐ 2.0 ఓఎస్‌తో పనిచేయనుంది. ఇందులో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తోపాటు 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డీ + డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ కేవలం 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌తో మాత్రమే విడుదలైంది. కాగా స్టోరేజ్‌ను ఎస్‌డీ కార్డుతో పెంచుకోవచ్చు.

రియల్‌మే నార్జో 30 5 జీ ఫోన్‌లో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ను అందించారు. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ తో పాటు, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్‌ అలాగే 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ అందించారు. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తోంది. ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో అలరించనుంది. ఈ ఫోన్ ను ఒకసారి ఛార్జీ చేసి ఏకధాటిగా 11 గంటలపాటు గేమ్స్ ఆడొచ్చని సంస్థ ప్రకటించింది. ఇందులో 5 జీ, 4 జీ ఎల్‌టీఈ, వై-ఫై 802.11 ఏసీ, బ్లూటూత్ వీ 5.1, జీపీఎస్ / ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 185 గ్రాములు. రియల్‌మీ నార్జో 30 5 జీలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను సైడ్ కు అందించారు.

రియల్ మీ నార్జో 30 స్పెసిఫికేషన్లు రియల్ మీ నార్జో 30 డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ రియల్‌మీ యూఐ 2.0 ఓఎస్ తో నడవనుంది. ఆండ్రాయిడ్ 11 లో కొన్ని మార్పులు చేసి యూఐ 2.0 ఓఎస్ ను తయారు చేశారు. ఇందులో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. అలాగే 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డీ + డిస్ప్లేని కలిగి ఉంది. ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ 95 SoC ప్రాసెసర్ ను అందించారు. ఇందులో 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ను కలిగి ఉంది. స్టోరేజ్ ను మైక్రో ఎస్‌డీ కార్డ్ తో 256జీబీ వరకు పెంచుకోవచ్చు.

రియల్ మీ నార్జో 30లో రియల్ మీ నార్జో 30 5 జీ లాంటి కెమెరా సెటప్ అందించారు. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ తోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 కెమెరాను ముందు భాగంలో అందించారు.

5,000ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చిన ఈ ఫోన్ 30W డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్‌ చేస్తుంది. ఫోన్ లో 4 జీ ఎల్‌టీఈ, వై-ఫై 802.11ఏసీ, బ్లూటూత్ వీ 5, జీపీఎస్ /ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీనిలోనూ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్కభాగంలో అందించారు. రియల్ మీ నార్జో 30 బరువు 192 గ్రాములు.

Also Read:

Work From Home: ఇక‌పై వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసే వారికి జీతాల్లో మార్పు.. ఇందుకు స‌రికొత్త టూల్‌ను రూపొందించిన గూగుల్‌

SIM cards: ఒక ఆధార్‌ కార్డు మీద ఎన్ని సిమ్‌ కార్డులు తీసుకోవచ్చు..? మీ పేరుపై ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి..!

Electric Vehicles: మన దేశంలో రానున్న మూడేళ్ళ కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 26 శాతం పెరగొచ్చు..ఆటో నిపుణుల అంచనా!

పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్
పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్
వాయనానికి వెరైటీ స్వీట్లు.. కంచి పట్టు చీర, రోలు, రోకలితో
వాయనానికి వెరైటీ స్వీట్లు.. కంచి పట్టు చీర, రోలు, రోకలితో
మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక పూజలు.. ఎందుకంటే?
మూకాంబికా అమ్మవారి ఆలయంలో సూర్య, జ్యోతిక పూజలు.. ఎందుకంటే?
చలి కాలంలో వచ్చే నోటి పుండ్లు.. ఇలా చెక్ పెట్టండి..
చలి కాలంలో వచ్చే నోటి పుండ్లు.. ఇలా చెక్ పెట్టండి..
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కి పెర్త్ టెస్ట్ రికార్డు హాజరు!
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కి పెర్త్ టెస్ట్ రికార్డు హాజరు!
ఎవడ్రా నువ్వు.. శ్రీవారి హుండీకే కన్నం వేశాడు.. ఆ తర్వాత
ఎవడ్రా నువ్వు.. శ్రీవారి హుండీకే కన్నం వేశాడు.. ఆ తర్వాత
ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ కావాలి
ఈ చర్మ సమస్యలు డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు.. అలర్ట్‌ కావాలి
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడి..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడి..
నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక.. మామూలు క్రైం స్టోరీ కాదుగా
నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక.. మామూలు క్రైం స్టోరీ కాదుగా
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.