Work From Home: ఇక‌పై వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసే వారికి జీతాల్లో మార్పు.. ఇందుకు స‌రికొత్త టూల్‌ను రూపొందించిన గూగుల్‌

Google Work From Home: క‌రోనా కార‌ణంగా చాలా రంగాలు ప్ర‌భావిత‌మైన విష‌యం తెలిసిందే. అయితే టెక్నాల‌జీతో సంబంధం ఉన్న ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు మాత్రం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ విధానాన్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేశాయి. దీంతో ఈ రంగాల‌పై...

Work From Home: ఇక‌పై వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసే వారికి జీతాల్లో మార్పు.. ఇందుకు స‌రికొత్త టూల్‌ను రూపొందించిన గూగుల్‌
Google Tool Work From Home
Follow us

|

Updated on: Jun 24, 2021 | 2:50 PM

Google Work From Home: క‌రోనా కార‌ణంగా చాలా రంగాలు ప్ర‌భావిత‌మైన విష‌యం తెలిసిందే. అయితే టెక్నాల‌జీతో సంబంధం ఉన్న ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు మాత్రం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ విధానాన్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేశాయి. దీంతో ఈ రంగాల‌పై క‌రోనా ప్ర‌భావం పెద్ద‌గా ప‌డ‌లేద‌నే చెప్పాలి. అయితే ఇక‌పై ఆఫీసులో ఉద్యోగం చేసే వారికి, వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసేవారికి ఒకేలా జీత‌భ‌త్యాలు ఉంటాయా? అంటే… కాద‌నే స‌మాధానం వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే గూగుల్ తొలి అడుగు వేసింది. ఇక‌పై ప‌నిచేసే ప్ర‌దేశం ఆధారంగా జీత‌భత్యాల‌ను నిర్ధారించ‌నున్నారు.

ఇందుకోసం గూగుల్ ఒక స‌రికొత్త టూల్‌ను తీసుకొచ్చింది. వ‌ర్క్ లొకేష‌న్ పేరుతో పిలుస్తోన్న టూల్ ఆధారంగా.. స‌ద‌రు ఉద్యోగి ఉండే ప్రాంతం, ఆ ప్రాంతంలో జీవ‌న వ్యయం (కాస్ట్ ఆఫ్ లీవింగ్‌), లోకల్ జాజ్‌తో ప‌లు అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోనుంది. వీటి ఆధారంగా ఉద్యోగికి ఎంత జీతం ఇవ్వాల‌న్న‌ది ఆ టూల్ లెక్క‌గ‌ట్టి చెబుతుంది. అంతేకాకుండా వారు నివ‌సిస్తోన్న ప్రాంతం ఆధారంగా వారికి ఇంకేం బెనిఫిట్స్ అందించాల‌నేది ఈ టూల్ నిర్ణ‌యిస్తుంది. ఇక ఉద్యోగుల‌ను కూడా ఎక్క‌డి నుంచి ప‌ని చేసుకోవాలనేది.. వాళ్ల స్వేచ్ఛకే వదిలేస్తున్నామని, అవసరమైతే బదిలీకి వెసులుబాటు కూడా కల్పిస్తామని గూగుల్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

Also Read: SIM cards: ఒక ఆధార్‌ కార్డు మీద ఎన్ని సిమ్‌ కార్డులు తీసుకోవచ్చు..? మీ పేరుపై ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి..!

Electric Vehicles: మన దేశంలో రానున్న మూడేళ్ళ కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 26 శాతం పెరగొచ్చు..ఆటో నిపుణుల అంచనా!

Stress in Plants: మొక్కే కదా అని తీసిపారేయకండి.. దానికీ ఒత్తిడి ఉంటుందట తెలుసా..?