Windows 11: ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన విండోస్ 11; అందుబాటులోకి ఎప్పుడంటే..?
మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్‌ను 2015 లో లాంచ్ చేసింది. అనంతరం దాదాపు ఆరేళ్ల తరువాత విండోస్ 11 ను విడుదల చేసింది.
Windows 11 Top 10 Features: ఎట్టకేలకు విండోస్ 11ను మైక్రోసాఫ్ట్ గురువారం రాత్రి విడుదల చేసింది. ఈ మేరకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో విండోస్ 11 ఫీచర్లు, యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తోంది లాంటి విషయాలను ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్‌ను 2015లో విడుదల చేసిన తరువాత.. అంటే దాదాపు ఆరేళ్లకు విండోస్ 11 ఓఎస్‌ను విడుదల చేయడం విశేషం. అయితే, ఈ మధ్యలో విండోస్ 10ఎక్స్‌ను ప్రకటించారు. కానీ, ఏవో కారణాలతో విండోస్ 10ఎక్స్‌ను ఆపేశారు. ప్రస్తుతం విడుదల చేసిన విండోస్ 11 యూజర్లకు కొత్త అనుభూతిని అందించనుంది. కొత్త థీమ్స్, ఐకాన్స్ తోపాటూ యూఐలో పలు మార్పులు చేసింది. విండోస్ 10 యూజర్లంతా కొత్త విండోస్ 11 కు ఉచితంగా అప్‌గ్రేడ్ కావొచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
ప్రస్తుత ఓఎస్‌లో ప్రారంభ మెను, సెర్చ్ బార్ లాంటి వాటిని మధ్యలో అందించారు. ఇంతకు ముందు అంటే విండోస్ 10లో స్టార్ట్ మెనూను ఎడమ భాగంలో ఉంచిన తెలిసింది. వీటితోపాటు ఆఫీస్ వర్క్ కోసం, గేమింగ్, స్కూల్స్ కోసం ప్రత్యేక డెస్క్‌టాప్‌లను సిద్ధం చేస్తుందని పేర్కొంది. విండోస్ 11 లో ఉన్న అద్భుతమైన ఫీచర్లను ఇప్పుడు చూద్దాం..
– విండోస్ 11 సరికొత్త డిజైన్‌తో రానుంది. స్టార్టప్ మెనూను మధ్య భాగంలో అందించారు. ఇది మ్యాక్ (ఆపిల్) ఓఎస్‌ను గుర్తు చేసేలా ఉంది. ఇంతకుముదు విండోస్ ఓఎస్‌లతో పోల్చితే.. ఇది భారీ మార్పుగానే చెప్పుకోవచ్చు. అయితే, ఈ మార్పు నచ్చని వారు సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా పాత పద్ధతిలోనే స్టార్టప్ మెనూ ను ఎడమవైపు మార్చుకోవచ్చు.
– కరోనా మహమ్మారితో అనేక కంపెనీలు ఇంటి వద్దనే పనిచేసే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇందుకోసం కొత్త ఓఎస్‌లో టాస్క్‌బార్‌లో చాట్ చేసే సౌకర్యాన్ని అందించాయి. దీంతో యూజర్లు టెక్ట్, వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చని తెలిపింది.
– విండోస్ 11 గేమర్లకు బాగా ఉపయోగపడుతుందిని మైక్రోపాఫ్ట్ తెలిపింది. ప్రత్యేకంగా వీరికోసం పలు ఫీచర్లను యాడ్ చేసింది. ఆటో హెచ్‌డీఆర్ సపోర్ట్, డైరెక్ట్ఎక్స్ 12 అల్టిమేట్, ఎక్స్‌క్లౌడ్ ఇంటిగ్రేషన్‌లతో విండోస్ 11 రానుంది. క్లౌడ్ గేమింగ్, ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ యాక్సెస్‌ను ఎక్స్‌క్లౌడ్ ఇంటిగ్రేషన్ ద్వారా పొందవచ్చు.
– విండోస్ 11 లో కొత్తగా విడ్జెట్లను అందిస్తున్నారు. ఇందులో ఏఐ టెక్నాలజీ తో యూజర్లు కోరుకున్న ఫీడ్‌ను అందిస్తుంది. అలాగే న్యూస్ విండోతో యూజర్లకు తాజా వార్తలు, వాతావరణ అప్‌డేట్‌లతోపాటు మరెన్నో నోటిఫికేషన్‌లు అందిస్తుంది. కొత్త థీమ్స్, కొత్త వాల్ పేపర్స్, మెరుగైన డార్క్‌మోడ్‌ను అందించారు.
– విండోస్ 11లో మెరుగైన టచ్ కీబోర్డు కూడా ఉంది. జిఫ్ ఫీచర్‌తోపాటు వాయిస్ డిక్టేషన్, వాయిస్ కమాండ్స్ కూడా ఇందులో అందించారు. ఇందులో టచ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను యాడ్ చేశారు. విండోస్ 10లో ఎన్నో విమర్శలను మెరుగుపరిచి అందిచారు.
– టీమ్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలను ఇన్‌బిల్ట్‌గా అందించారు. ఇందులో మ్యూట్ అండ్ అన్‌మ్యూట్ ఫీచర్లను యాడ్ చేశారు. ఎడ్జ్ బ్రౌజర్ లోనూ పలుమార్పులు చేశారు.
– మైక్రోసాఫ్ట్ స్టోర్‌ను కూడా విండోస్ 11లో మెరుగుపరిచారు. సెర్చ్ సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా డిజైన్‌లో పలు మార్పులు చేశారు. డెవలపర్ల కోసం జీరో రెవిన్యూ షేర్ పద్ధతిని తీసుకువచ్చింది. దీనిని బట్టి మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో ఉండే యాప్స్‌కు వచ్చే రెవిన్యూని కంపెనీ తీసుకోదన్న మాట. ఇది జులై 28 నుంచి ప్రారంభం కానుంది.
– ఆండ్రాయిడ్ యాప్స్ ను విండోస్ 11 లో అందించనున్నారు. ఇందుకోసం అమెజాన్ యాప్ స్టోర్‌ను ఇన్‌బిల్ట్‌గా అందించారు. ఇందుకోసం ఇంటెల్ బ్రిడ్జ్ టెక్నాలజీని వాడినట్లు తెలిపింది.
– మైక్రోసాఫ్ట్ కొత్త ఓస్‌తో వినియోగదారులను మల్టీ టాస్క్ చేసేందుకు గాను స్నాప్ లేఅవుట్లు, స్నాప్ గ్రూపులు, డెస్క్‌టాప్‌లను ప్రవేశపెట్టింది. అలాగే వేర్వేరు డెస్క్‌టాప్‌లను కూడా దీంట్లో క్రియోట్ చేసుకోవచ్చు.
విండోస్ 11 అందుబాటులోకి ఎప్పుడంటే… విండోస్ 11 వచ్చే వారం నుంచి విండోస్ ఇన్సైడర్ సభ్యులకు అందుబాటులో ఉండనుంది. ఈ ఏడాది చివర్లో విండోస్ 10 యూజర్లు ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చంట. అయితే, కొత్త పీసీలలో విండోస్ 11 ను ఇన్‌స్టాల్ చేసి ఇవ్వనున్నట్లు తెలిపింది.
Also Read:
Vivo V21e 5G: వివో నుంచి కొత్త 5జీ ఫోన్ విడుదల; ధర రూ.25 వేలలోపే!