Komaki Electric Scooter : ఈ కంపెనీ స్కూటర్‌పై రూ.20,000 తగ్గింపు..! అవకాశం కొన్నిరోజులు మాత్రమే..

Komaki Electric Scooter : కోమాకి కంపెనీ ఇటీవల తన కొత్త డీలర్‌షిప్‌ను ఢిల్లీలో ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ వాహన సంస్థ

Komaki Electric Scooter : ఈ కంపెనీ స్కూటర్‌పై రూ.20,000 తగ్గింపు..! అవకాశం కొన్నిరోజులు మాత్రమే..
Komaki Electric Scooter
Follow us
uppula Raju

|

Updated on: Jun 25, 2021 | 4:25 PM

Komaki Electric Scooter : కోమాకి కంపెనీ ఇటీవల తన కొత్త డీలర్‌షిప్‌ను ఢిల్లీలో ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ వాహన సంస్థ 2021లో ఇప్పటివరకు 14,500 వాహనాలను విక్రయించింది. ఢిల్లీలో ప్రారంభించిన షోరూం నుంచి ఇప్పటికే 120 వాహనాలను విక్రయించింది. ఇప్పుడు శుభవార్త ఏమిటంటే కోమాకి టిఎన్ -95 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఢిల్లీలో రూ.20,000 తగ్గింపు ధరతో అమ్మకాలు చేస్తుంది. అన్ని టెస్ట్ వాహనాలు, అమ్మకాల సేవలు డీలర్‌షిప్‌లో మాత్రమే లభిస్తాయని EV తయారీదారు చెప్పారు. ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. అటువంటి పరిస్థితిలో రాబోయే సమయంలో, వినియోగదారులు మరిన్ని మోడళ్లను చూడవచ్చు.

ఇంటి నుంచే స్కూటర్ కొనండి కొమాకి ఇటీవలే తన ఆన్‌లైన్ వెహికల్ బుకింగ్ వ్యవస్థను కూడా ప్రారంభించింది. ఇందులో వినియోగదారులు తమ ఇళ్ల నుంచే తమకు నచ్చిన మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు. ఢిల్లీలో ఈవీల కొనుగోలును వేగవంతం చేయడానికే ఈ సబ్సిడీ అని కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా అన్నారు. దీని ద్వారా వాయు కాలుష్యం ఉండదని తెలియజేశారు. భారతదేశాన్ని హరిత దేశంగా చూడటానికే కోమకి కంపెనీని నడిపిస్తున్నానని ఆయన అన్నారు. వచ్చే రెండు నెలల్లో ఢిల్లీ అంతటా 12 కొత్త అవుట్‌లెట్లను ప్రారంభించడంతో కంపెనీ ఈ కలను సాకారం చేస్తుందని పేర్కొన్నారు. ఇటీవలి FAME II సబ్సిడీ పునర్విమర్శ కారణంగా కొమాకి ఎలక్ట్రిక్ వాహనాల ధర మరింత తగ్గుతుందని అంచనా. అయితే సంస్థ త్వరలో నగరాల వారీగా ధరలను వెల్లడిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ఈ సంస్థ స్కూటర్ కొనాలనుకునే వినియోగదారులు దానిపై నిఘా పెడితే సరిపోతుంది.

PPF Account : ఒక రోజులో పిపిఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు జమ చేయవచ్చు..! పరిమితులేంటి తెలుసుకోండి..

Viral Photos : భారతదేశంలోనే అత్యంత పురాతన కోట ఇదే..! దీని చరిత్ర ఎంతో ఆసక్తికరం.. మీరు తిలకించండి..

Anupama Results: బిహార్ టెట్ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన న‌టి అనుప‌మ‌.. బిహార్‌లో ఎందుకు ఎగ్జామ్ రాసింద‌నేగా..?