Anupama : బిహార్ టెట్ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన న‌టి అనుప‌మ‌.. బిహార్‌లో ఎందుకు ఎగ్జామ్ రాసింద‌నేగా..?

అందాల తార అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బిహార్ రాష్ట్రంలో జ‌రిగిన టెట్ పరీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించింది. ఏకంగా 77 శాతం మార్కుల‌తో ఫ‌స్ట్ క్లాస్‌లో నిలిచింది. కేర‌ళ‌కు చెందిన అనుప‌మ బిహార్‌లో ఎందుకు ఎగ్జామ్ రాసింది..?

Anupama : బిహార్ టెట్ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన న‌టి అనుప‌మ‌.. బిహార్‌లో ఎందుకు ఎగ్జామ్  రాసింద‌నేగా..?
Anupama
Follow us
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Updated on: Jun 25, 2021 | 5:28 PM

Anupama Results: అందాల తార అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బిహార్ రాష్ట్రంలో జ‌రిగిన టెట్ పరీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించింది. ఏకంగా 77 శాతం మార్కుల‌తో ఫ‌స్ట్ క్లాస్‌లో నిలిచింది. కేర‌ళ‌కు చెందిన అనుప‌మ బిహార్‌లో ఎందుకు ఎగ్జామ్ రాసింది..? అస‌లు న‌టిగా బిజీగా ఉన్న స‌మ‌యంలో టీచ‌ర్ చేయాల‌ను ఎందుకు అనుకుంటోంది అని ఆలోచిస్తున్నారా.? అయితే మీరు ఓసారి ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే..

బిహార్‌లో ఇటీవ‌ల సెకండ‌రీ టీచ‌ర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఎస్‌టీఈటీ) ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించింది. తాజాగా ఈ ప‌రీక్ష‌కు సంబంధిన ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. అయితే ఈ ప‌రీక్ష‌ల్లో రిషికేశ్ కుమార్ అనే విద్యార్థి 77 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించాడు. అయితే స‌ద‌రు విద్యార్థి స్కోర్ కార్డులో మాత్రం అనుప‌మ ఫొటో వ‌చ్చింది. ఆశ్చ‌ర్య‌పోయిన‌ రిషికేశ్ ఈ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్ర‌స్తుతం ఈ స్కోర్ కార్డు నెట్టింట తెగ వైర‌ల్‌గా మారింది. అయితే కేవ‌లం స్కోర్ కార్డులోనే కాకుండా అడ్మిట్ కార్డులో కూడా అనుప‌మ ఫొటోనే ముద్రించార‌ట‌. ప‌రీక్ష‌ల స‌మ‌యంలో రిషికేశ్ ఈ విష‌యాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లాడు కూడా. దీనిపై స్పందించిన అధికారులు త‌ప్పును స‌రిదిద్దుతామ‌ని తెలిపారు. కానీ స్కోర్ కార్డులోనూ అనుప‌మ ఫొటోనే ప్రింట్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇక ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో విద్యా శాఖ అధికారి సంజయ్‌ కుమార్ ఈ విష‌య‌మై ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు. ఇదిలా ఉంటే బిహార్‌లో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కాదు గ‌తంలోనూ ఇలాంటి త‌ప్పులే దొర్లాయి. జూనియ‌ర్ ఇంట‌ర్ ప‌రీక్ష‌లో బాలీవుడ్ తార స‌న్నీలియోన్‌ను టాప‌ర్‌గా ప్ర‌క‌టించింది అక్క‌డి ఇంట‌ర్ బోర్డ్‌. అప్ప‌ట్లో ఈ వార్త దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది.

Also Read: Michael Jackson : మైకెల్ జాక్సన్ జీవితానికి సంబంధించి 10 ఆశ్చర్యకరమైన నిజాలు..! మీకు తెలుసా..?

Naandhi Movie: ‘నాంది’ హిందీ రీమేక్.. బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి నిర్మించనున్న దిల్ రాజు..

Surveen Chawla: “అక్కడ నాకు చేదు అనుభవం.. అగ్ర దర్శకుడు నన్ను ఇబ్బంది పెట్టాడు”.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన కామెంట్స్..