Surveen Chawla: “అక్కడ నాకు చేదు అనుభవం.. అగ్ర దర్శకుడు నన్ను ఇబ్బంది పెట్టాడు”.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన కామెంట్స్..

దక్షిణాది సినీ పరిశ్రమకు చెంది ఓ అగ్ర దర్శకుడి తనను ఇబ్బంది పెట్టాడని బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా ఆరోపించారు. ఓ సినిమా విషయంపై తనతో ఇబ్బందికరంగా మాట్లాడాడని..

Surveen Chawla: అక్కడ నాకు చేదు అనుభవం.. అగ్ర దర్శకుడు నన్ను ఇబ్బంది పెట్టాడు.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన కామెంట్స్..
Surveen Chawla
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 25, 2021 | 12:37 PM

దక్షిణాది సినీ పరిశ్రమకు చెంది ఓ అగ్ర దర్శకుడి తనను ఇబ్బంది పెట్టాడని బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా ఆరోపించారు. ఓ సినిమా విషయంపై తనతో ఇబ్బందికరంగా మాట్లాడాడని.. సౌత్ ఇండస్ట్రీలో ఆ దర్శకుడి వల్ల తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని సుర్వీన్ అన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే నటి సుర్వీన్ చావ్లాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అందులో సుర్వీన్ మాట్లాడుతూ.. ఏ పరిశ్రమలోనైనా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. నేను కూడా అది ఎదుర్కోన్నాను. దక్షిణాదిలో పేరున్న అగ్ర దర్శకుడి సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది. అక్కడికి ఆడిషన్స్ కు వెళ్లాను. ఒకరోజు మొత్తం అక్కడే ఉన్నాను. దాంతో అనారోగ్యానికి గురై.. తిరిగి ముంబై వెళ్లిపోయాను. “మీకు ఆరోగ్యం బాలేదు కదా నన్ను ముంబై రమ్మంటారా ?” అంటూ ఆ దర్శకుడు నాకు ఫోన్ చేశాడు. అవసరం లేదని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత కూడా ఆయన వరుసగా నాకు ఫోన్లు చేశారు. నాకెందుకో కాస్తా అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఆ డైరెక్టర్ వాళ్ల స్నేహితుడితో కాల్ చేయించాడు. ఈ సినిమా తెరకెక్కించడానికి చాలా సమయం పడుతుంది. డైరెక్టర్ గారు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. సినిమా పూర్తయ్యే వరకే. ఆ తర్వాత కావాలంటే ఆపేయండి అని అన్నాడు. ఆయన మాటల్లోని భావం అర్థమైంది. నా టాలెంట్ నచ్చితే అవకాశం ఇవ్వండి.. లేకపోతే అవసరం లేదు అని ఆన్సర్ ఇచ్చాను. ఇంకా సినిమా ప్రారంభమైనట్టు లేదు. కేవలం దక్షిణాదిలోనే కాదు.. బాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ఓ డైరెక్టర్ నా కళ్లు ఎలా ఉన్నాయో చూడాలనుకున్నాడు. మరొకరు నా శరీరభాగాలు చూడాలనుకున్నాడు అంటూ సుర్వీన్ చావ్లా చెప్పుకోచ్చారు. ప్రస్తుతం సుర్వీన్ చావ్లా సినిమాలకు దూరంగా ఉన్నారు. తెలుగులో రాజు మాహారాజు సినిమాలో సుర్వీన్ నటించారు.

Also Read: Karthika Deepam : మోనిత విషయంలో అనుమానం వ్యక్తం చేసిన సౌందర్య.. మా పెళ్లి జరగకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన మోనిత

MAA Elections 2021: అన్నయ్య సపోర్ట్ అతనికే.. మనం తెలుగు యాక్టర్స్ మాత్రమే కాదు.. ఇండియన్ యాక్టర్స్.. నాగబాబు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!