Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections 2021: అన్నయ్య సపోర్ట్ అతనికే.. మనం తెలుగు యాక్టర్స్ మాత్రమే కాదు.. ఇండియన్ యాక్టర్స్.. నాగబాబు..

Nagababu: ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నికల వేడి రాజుకుంది. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే ఎన్నికల

MAA Elections 2021: అన్నయ్య సపోర్ట్ అతనికే.. మనం తెలుగు యాక్టర్స్ మాత్రమే కాదు.. ఇండియన్ యాక్టర్స్.. నాగబాబు..
Nagababu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 25, 2021 | 11:56 AM

Nagababu: ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నికల వేడి రాజుకుంది. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రతి సంవత్సరం ఇద్దరు మాత్రమే పోటీ పడే ఈ ఎన్నికల్లో ఈసారి నలుగురు అభ్యర్థులు పోటిపడుతుండడంతో ఎన్నికల సమరం మరింత రసవత్తరంగా మారాయి. అయితే ఎన్నికలలో మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందని నటుడు నాగబాబు అన్నారు.

మా ఎన్నికల గురించి నాగబాబు మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు మా అన్నయ్య మెగస్టార్ చిరంజీవి మద్దతు ఉంది. తను మమ్మల్ని రెండు నెలల కింద కలిసాడు. ఇందులో ఉన్న సమస్యల గురించి చెప్పాడు. బిల్డింగ్ లేదు.. మా అంటే ఒకే కుటుంబం అంటూ చెప్పాడని నాగబాబు అన్నారు. ప్రకాశ్ రాజ్ కు ప్రతి ఒక్కరితో మాట్లాడే సత్తా ఉందన్నారు నాగబాబు. ఇలాంటి వ్యక్తి మా అసోసియేషన్ లో ఉంటే బాగుంటుంది అనుకున్నాం. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది సమస్య ఉత్పన్నం కాదు. మనం తెలుగు యాక్టర్స్ మాత్రమే కాదు.. ఇండియన్ యాక్టర్స్ అన్నారు. పెద్దవారికి లేని లోకల్ సమస్య.. ఒక కుటుంబం లాగా ఉండేవారికి ఎందుకని నాగబాబు ప్రశ్నించాడు. మెగాస్టార్ చిరంజీవితోపాటు.. తన మద్దతు కూడా ప్రకాశ్ రాజ్ కు ఉందని నాగబాబు స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. ప్రకాశ్ రాజ్ కు ముందు నుంచి మద్దతు తెలుపుతున్న నటుడు సాయి కుమార్ మా ఎన్నికలపై స్పందించాడు. సాయి కుమార్ మాట్లాడుతూ.. సిని’మా’ బిడ్డలం.. మన కోసం మనం.. ‘మా’ కోసం మనం అనే నినాదంతో ముందుకు వస్తున్న ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో సంతోషంగా ఉందన్నాడు. మీ ఆదరాభిమానాలు కళామా తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నాడు.

ఇక ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యురాలు.. జయసుధ మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్ తనకు 2018లో మా అధ్యక్ష పదవికి పోటి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.. తన విజన్ చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు కావల్సినవి తప్పకుండా చేస్తారని.. మద్దతు ఇవ్వాలని కోరారు.

నాగబాబు..

వీడియో..

Also Read: Accident: బాప్‌రే.. షాకింగ్ యాక్సీడెంట్.. హైవే రేయింలింగ్‌పై నిలిచిన కారు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Prakash Raj : గత ఎన్నికల్లో లోకల్ – నాన్ లోకల్ ఇష్యూ రాలేదు.. ఇప్పుడే ఎందుకు వస్తుంది.? : ప్రకాష్ రాజ్