Karthika Deepam : మోనిత విషయంలో అనుమానం వ్యక్తం చేసిన సౌందర్య.. మా పెళ్లి జరగకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన మోనిత
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1975 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు హైలెట్స్ చూద్దాం.. నాతో మాట్లాడు దీప అంటే.. చెప్పండి దీప.. అంటే విన్నదే అయితే మాట్లాడుకోవడం ఎందుకు చెప్పిందే అయితే..
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1975 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు హైలెట్స్ చూద్దాం.. నాతో మాట్లాడు దీప అంటే.. చెప్పండి దీప.. అంటే విన్నదే అయితే మాట్లాడుకోవడం ఎందుకు చెప్పిందే అయితే చెప్పుకోవడం ఎందుకు. అవన్నీ పక్కన పెడదాం దీప అంటే.. జరిగినవన్ని పక్కన పెడదాం దీప అంటే నన్ను కూడా అంటే.. జరిగినదానితో నాకు ఏమి సంబంధం అని అడుగుతుంది. మన మధ్య ఉంది భార్యభర్తల సంబంధం అంటే.. మరి ఆ సంబంధానికి ఏ పేరు పెడతారు అని ప్రశ్నిస్తుంది.. భార్య ఉండగా పరాయి స్త్రీ తో … వద్దులెండి ఆ పదం పలకడానికే అసహ్యం వేస్తుంది. నేను అలాంటి మాటలు అనలేను.. నేను చేయని తప్పుకి అవమానింపబడ్డాను.. వెలివేయబడ్డాను.. ప్రాధేయ పడ్డాను.. దగా పడ్డాను.. ఎన్ని మాటలు అన్నా పడ్డాను.. ఇప్పుడు మీరు మీరు చేసిన తప్పుని సమర్ధించుకోవడానికి చర్చలు సమావేశాలు.. ఈ పరిస్థితి నేను ఎలా ఎదుర్కోవాలో నాకే తెలియడం లేదు.. నేను మీలా అనలేను.. మిమ్మల్ని ఎవరేమన్నా వినలేను.. అదే మీకు నాకు తేడా .. ఎందుకో దీపా దేనికీ స్పందించడం లేదు అన్నది మీకు ఓ క్లారిటీ వచ్చిందనుకుంటాను.. ఇప్పుడు చెప్పండి.. మీ భార్యగా నేను మీకు ఏ విధంగా సాయపడగలను. నాకు నేను సద్దిచెప్పుకోవాలా.? లేక రాజీ పడాలా? ఇంతే నా తలరాత అని ఇంతటితో సరిపెట్టుకోవాలా? భగవంతుడు కూడా అమర్చలేని ఈ దుర్దశని మానవమాత్రురాల్నికి ఎదో అద్భుతం సృష్టించి సరిచేసుకోవాలా.. ఏమి చేయగలను నేను అని కార్తీక్ ని ప్రశ్నిస్తుంది.
దీంతో కార్తీక్ నువ్వుగానే ఉండు నన్ను నమ్ము ఎన్నో ఏళ్లు నేను మారతానని నమ్మకంతో ఉన్నాను నన్ను తిట్టు ఇంకా కసి తీరకపోతే నా చెంప పగలగొట్టు నేను ఏ తప్పు చెయ్యలేదు అనట్లేదు .. ఆ తప్పు నాకు తెలియకుండానే జరిగిందని నమ్ము.. నా ప్రమేయం లేకుండానే జరిగిందని నమ్ము.. ఇదంతా నా తప్పుని కప్పి పుచ్చుకోవాటానికి చెప్పడం లేదు అంటాడు దీప నేను ఈ పరిష్టితిని జీర్ణించుకోలేకపోతున్న.. నేను సవతి తెచ్చి పెడతా అంటే సర్దుకుపోయే విషమైన మనసులేదు. నేను సగటు ఆడపిల్లనే.. నా భర్త, నా పిల్లలు అనుకునే సగటు భార్యని అంటుంది.. నేను నీకు అన్యాయం చేయడానికి రెడీగా లేను.. నాకు నువ్వు, పిల్లలు చాలు అంటాడు కార్తీక్.
మరోవైపు సౌందర్య తో మోనిత జ్యుస్ తాగుతుంటే.. నా కొడుకు నాకో విషయం చెప్పాడు అని అంటే.. మోనిత టెన్షన్ పడుతూ .. చెప్పండి ఆంటీ కార్తీక్ ఏమి చెప్పాడు అని అడుగుతుంటే.. నీకు తెలిసి తెలియనట్లు నటించకు మోనిత.. నేను ఆ తప్పు చేశానంటే నమ్మలేకపోతున్నా మమ్మీ.. ఎలా జరిగిందో నాకు తెలియడం లేదు.. అన్నాడు.. నువ్వు గైనిక్ వి నీతో ఇంకా లోతుగా చర్చించగలను.. కాకపొతే నువ్వు ఇప్పుడు కన్నెపిల్లవి కాదు.. కాకపోతే దానికి కారణం మావాడు కాదు అంటున్నాడు. టెన్షన్ పడుతున్న మోనితతో తప్పు గురించి తప్పుడు సమాచారం సృష్టించావా.. లేక తప్పుడు సమాచారం క్రియేట్ చేశావా.. తప్పు తప్పు టోన్ కల్పిస్తే తప్పు.. నువ్వు తప్పా.. మావాడికి నువ్వు పొంచి ఉన్న నిప్పా అంటూనే.. నువ్వు మా వాడి విషయంలో దీప ముందు బయటపెట్టగానే వాడు తలదించుకోలేదు.. పైగా నిన్నే తిట్టాడు.. అప్పుడు వాడి కళ్ళల్లో నిజాయతీ కనిపించింది.. ఇప్పటికి అదే నిజాయతీ వాడిలో ఉంది.. అంటూ మాట్లాడుతుంటే.. మోనిత భయాన్ని కవర్ చేసుకుంటూ.. సౌందర్య తో వాదనకు దిగుతుంది.
బాగుంది ఆంటీ నాకు కార్తీక్ మధ్యమీరు ఎవరూ కూల్చలేని గోడ కడుతున్నారు.. మా ఇద్దరి మధ్య ఏ పరిస్థితుల్లో జరిగిందో తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు.. నేను చెప్పేది నిజం.. దీనిని నిరూపించుకోవడానికి ఏ వేదికనైనా మీరు ఆశ్రయించవచ్చు అంటూనే .. మీ ఉద్దేశ్యం ఏమిటి.. దీప విషయంలో కార్తీక్ అనుమానించినప్పుడు.. దీపకి అండగా నిలబడ్డారు.. మరి నా విషయంలో కార్తీక్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకాలం మీరు చాలా ఫర్ఫెక్ట్ అనుకున్నాను.. నాకు సపోర్ట్ చేసి మొదటి వ్యక్తి మీరే అవుతారు అనుకున్నాను.. కానీ మీరు సగటు తల్లిగా మారిపోయారు.. మీరు మీ కొడుకుతో కలిసి నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారని నాకు అర్ధమైంది.
అంటూ.. నిజం నాకడుపులో ఉంది కనుక నేను రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్తున్నా.. ఈనెల 25న కార్తీక్ ని నేను పెళ్లి చేసుకోబోతున్న అంటూ కార్తీక్ ని తప్పించుకోవద్దని.. ఏ ఊరుకో వెళ్లి తలదాచుకోవద్దని చవకబారు సలహాలు ఇవ్వొద్దని చెప్పడానికి ఇక్కడికి వచ్చా .. అదే జరిగితే.. తర్వాత జరిగే పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని సౌందర్యని హెచ్చరిస్తూ.. నాకు 25 తేదీన మీ కొడుకుతో పెళ్లి ఆశీర్వదించండి అత్తయ్యగారు.. అంటూ సౌందర్య కాళ్లకు మొక్కుతుంది. అదే సమయంలో హిమ శౌర్యలు వస్తారు.. షాక్ తింటారు.
చూసిన సౌందర్య, శ్రావ్యలు షాక్ తింటే.. మోనిత నవ్వుతూ.మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారా అని ప్రశ్నిస్తుంటే.. శ్రావ్య వాళ్ళని లోపలి తీసుకుని వెళ్తుంది. మోనిత గడప దాటుతూ.. మళ్లీ పెళ్లి విషయం గుర్తు చేస్తుంది. సౌందర్య.. ఈ సంగతి దీపకు తెలిస్తే.. ఎం జరుగుతుంది.. కార్తీక్ ని ద్వేషిస్తుందా.. మోనితని చంపేస్తుందా అసలు ఈ పెళ్లిని ఆపే అవకాశమే లేదా అని ఆలోచిస్తుంది
పిల్లలు ఇంట్లో లేరని కంగారు పడుతూ.. సరోజక్కకి ఫోన్ చేస్తుంది. అక్కడ లేకపోవడంతో.. సౌందర్యకు ఫోన్ చేస్తుంది. అక్కడికి వెళ్లారని తెలిసాక అక్కడే ఉన్న కార్తీక్ కి మీ ఇంటికి వెళ్లారట పిల్లలు అని చెప్పి.. లోపలికి వెళ్తుంది. దీప మన ఇల్లు అనకుండా మీ ఇల్లు అంటుంది ఏమిటి అనుకుంటూ.. పాత విషయాలను జ్ఞాపకం చేసుకుంటాడు కార్తీక్. తన జీవితం ఎందుకు ఇలా అయ్యిందని కార్తీక్ భాధపడుతుంటారు.. రేపటి ఎపిసోడ్ లో కార్తీక్ ని మోనిత బయటకు తీసుకుని వెళ్తుంది.. వాళ్ళని ఫాలోఅవుతుంది దీప.. మరి దీప నిర్ణయం ఏమిటో చూడాలి మరి
Also Read: గత ఎన్నికల్లో లోకల్ – నాన్ లోకల్ ఇష్యూ రాలేదు.. ఇప్పుడే ఎందుకు వస్తుంది.? : ప్రకాష్ రాజ్