AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kathi Mahesh: రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలు.. ఐసీయూలో చికిత్స

Kathi Mahesh Road Accident: సినీ నటుడు, బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్‌‌ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై..

Kathi Mahesh: రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలు.. ఐసీయూలో చికిత్స
Kathi Mahesh
Ravi Kiran
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 26, 2021 | 4:29 PM

Share

సినీ నటుడు, బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్‌‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు..ముందుగా వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహేష్‌ తలకు, కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కత్తి మహేష్ నెల్లూరులోని మెడికేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఆయనకు చికిత్స కల్పిస్తున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఆయన కుటుంబీకులు, సన్నిహితులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన ‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ద్వారా ఆయన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. అంతేకాకుండా తరచూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులను పలకరించేవారు.

Also Read:

ఈ పండుతో డయాబెటీస్‌కు చెక్ పెట్టొచ్చు.. ప్రపంచంలోనే తియ్యటి ఫ్రూట్.. ప్రత్యేకత ఇదే.!

ఈ కొండచిలువను చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. వీడియో చూస్తే మీరు ఫిదా కావాల్సిందే.!

వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..

చెట్టు తొర్రలో భారీ గుడ్లు.. వాటిని పగలగొట్టి చూడగా స్థానికులు హడల్.!