వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..
భయం అంటే ఏమిటో ఆ బ్యాట్స్‌మెన్‌కు తెలియదు. ప్రత్యర్ధి బౌలర్ ఎవరైనా చీల్చి చెందటమే. వరుసపెట్టి సిక్సర్లతో విరుచుకుపడతాడు. అతడెవరో కాదు....
భయం అంటే ఏమిటో ఆ బ్యాట్స్‌మెన్‌కు తెలియదు. ప్రత్యర్ధి బౌలర్ ఎవరైనా చీల్చి చెండాడటమే. వరుసపెట్టి సిక్సర్లతో విరుచుకుపడతాడు. అతడెవరో కాదు.. ఇంగ్లాండ్ డొమెస్టిక్ ప్లేయర్ జోర్డాన్ థాంప్సన్. ఈ ఆటగాడి వయస్సు 24 సంవత్సరాలే. తాజాగా జరిగిన టీ20 బ్లాస్ట్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. యార్క్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జోర్డాన్ థాంప్సన్ ఫాస్టెస్ట్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.
జూన్ 23వ తేదీన యార్క్‌షైర్, వోర్సెస్టర్‌షైర్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్ మొదట బ్యాటింగ్ చేసింది. 11 ఓవర్లకు కేవలం 50 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతేకాకుండా కీలకమైన ఐదు వికెట్లు కూడా కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి 41 నిమిషాల పాటు విధ్వంసం సృష్టించాడు.
ప్రత్యర్ధి బౌలర్లపై కనికరం చూపించని థాంప్సన్ 235.71 స్ట్రైక్ రేట్‌తో 28 బంతుల్లో అజేయంగా 66 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. అలాగే థాంప్సన్ కేవలం 10 బంతుల్లోనే 50 పరుగులు చేరుకోవడం గమనార్హం. జోర్డాన్ థాంప్సన్ విధ్వంసానికి యార్క్‌షైర్ నిర్ణీత ఓవర్లకు 192 పరుగులు చేసింది. ఇక టార్గెట్ చేధించే క్రమంలో వోర్సెస్టర్షైర్ కెప్టెన్, వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ బెన్ కాక్స్ వీరోచిత ఇన్నింగ్స్‌తో పోరాడిన ఆ జట్టు 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Also Read:
ఇంటి పైకప్పు తుడుస్తుండగా వర్కర్లకు షాక్.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి విస్తుపోయే విషయాలు.!
ఆ ఒక్క చేప లక్షలు తెచ్చిపెట్టింది.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి.!