AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి.!

OTT Releases: కరోనా ఫస్ట్ వేవ్ తగ్గింది.. ఫిల్మ్ ఇండస్ట్రీ పుంజుకుంటోంది అని అనుకునేలోపే.. సెకండ్ వేవ్ వచ్చిన మొత్తం తలక్రిందులు చేసింది. లాక్‌డౌన్ పడటం..

OTT: ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి.!
Ravi Kiran
|

Updated on: Jun 24, 2021 | 12:14 PM

Share

కరోనా ఫస్ట్ వేవ్ తగ్గింది.. ఫిల్మ్ ఇండస్ట్రీ పుంజుకుంటోంది అని అనుకునేలోపే.. సెకండ్ వేవ్ వచ్చిన మొత్తం తలక్రిందులు చేసింది. లాక్‌డౌన్ పడటం.. థియేటర్లు మూతపడటం జరిగిపోయింది. ఇక ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వస్తోంది. పలు చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ సైతం మొదలయ్యాయి. మహారాష్ట్ర సర్కార్ 50 శాతం సామర్ధ్యంతో థియేటర్లు తెరిచేందుకు అనుమతించినా.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ పున: ప్రారంభానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు సినీ ప్రేమికులను ఓటీటీల్లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ వీక్ రిలీజ్ అయిన, కాబోయే లిస్టులో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో లుక్కేద్దాం పదండి.!

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ‘గోతమ్‌’ వెబ్ సిరీస్ ఆల్‌ సీజన్స్‌ జూన్‌ 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. ‘లోకి’ ఎపిసోడ్ 3 నిన్నటి నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌‌లో ప్రసారం అవుతోంది. అటు నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ‘టూ హాట్‌ టు హ్యాండిల్‌’ జూన్‌ 23 నుంచి టెలికాస్ట్ అవుతోంది.

గ్రహాన్(Grahan)

1984 జార్ఖండ్‌లోని బోకారోలో జరిగిన అల్లర్ల నేపధ్యంలో తెరకెక్కించిన పీరియడికల్ వెబ్ సిరీస్ ‘గ్రహాన్’. సత్యవ్యాస్ రాసిన “చౌరాసి” నవల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్ జూన్ 24 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌‌లో ప్రసారం అవుతుంది.

ధూప్ కి దీవార్(Dhoop Ki Deewar)

పాకిస్తానీ డ్రామా సిరీస్ అయిన ఈ ‘ధూప్ కి దీవార్’ను హసీబ్ హస్సన్ డైరెక్ట్ చేయగా.. ఉమేరా అహ్మద్ కథను అందించారు. ఇండో-పాక్ యుద్ధం చుట్టూ దీని కథాంశం నడుస్తుంది. ఈ నెల 25 నుంచి జీ-5 ఓటీటీలో ప్రసారం కానుంది.

రే(Ray)

నాలుగు విభిన్న కథల సమాహారమే ‘రే’. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్, అలీ ఫజాల్, కే కే మీనన్, హర్షవర్ధన్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 25వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.

వీటితో పాటు LOL సలామ్(జీ5), థేన్(సోనీ లివ్), ఎల్‌కేజీ, జీవీ(ఆహా) వంటి చిత్రాలు శుక్రవారం నుంచి ఆయా ఓటీటీలలో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి లేట్ ఎందుకు వీటిల్లో మీకు నచ్చిన చిత్రాన్ని ఈ వీకెండ్ చూసేయండి.!

Also Read:

Viral Video: అందంతో చంపుతున్న సొట్టబుగ్గల సుందరి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.!

Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!

సెహ్వాగ్, డివిలియర్స్ స్టైల్‌లో.. 17 బంతుల్లో 76 పరుగులు.. బౌలర్లకు చుక్కలే చుక్కలు!