AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kapil Dev: ఎప్పటికీ ఆ విజయమే వెరీ వెరీ స్పెషల్! ‘కపిల్స్ డెవిల్స్‌ ఆఫ్ 1983’ అంటూ ఫ్యాన్స్ సందడి

భారత క్రికెట్‌లో వెరీ వెరీ స్పెషల్ డే ఏదైనా ఉందంటే.. అదే 1983 జూన్ 25. ఆరోజును భారత క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేరు.

Kapil Dev: ఎప్పటికీ ఆ విజయమే వెరీ వెరీ స్పెషల్! 'కపిల్స్ డెవిల్స్‌ ఆఫ్ 1983' అంటూ ఫ్యాన్స్ సందడి
1983 World Cup Kapil Dev
Venkata Chari
|

Updated on: Jun 25, 2021 | 2:56 PM

Share

1983 World Cup: భారత క్రికెట్‌లో వెరీ వెరీ స్పెషల్ డే ఏదైనా ఉందంటే.. అదే 1983 జూన్ 25. ఆరోజును భారత క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేరు. 38 ఏళ్ల క్రితం ఇదే రోజు కపిల్స్‌ డెవిల్స్‌ భారత్ క్రికెట్‌కు తొలి ఐసీసీ ట్రోఫీని అందించి, అందరి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు.. లార్డ్స్ లో విశ్వవిజేతగా నిలిచి, క్రికెట్‌ ను నరనరాల్లోకి ఎక్కించేలా చేసింది. తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడి, భారత క్రికెట్లో ఇదో చరిత్రాత్మకమైన రోజులా మార్చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భారత క్రికెట్‌ ప్రస్థానంలో కపిల్ పేరు సంచలనంగా మారిపోయింది. కెప్టెన్‌గానే కాదు, బౌలర్‌గా, ఫీల్డర్‌గా ఇలా ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఎందరికో ఆదర్శంగా మారిపోయాడు. అందుకే అభిమానులు ముద్దుగా ‘కపిల్ అందించిన ప్రపంచ కప్‌’ అంటుంటారు. అలాగే కపిల్ డెవిల్స్‌ అంటూ పిలుస్తుంటారు.

కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు 1983 ప్రపంచకప్ కోసం బయలు దేరింది. అయితే, భారత్ పై ఎలాంటి అంచనాలు లేవు. అసలు లీగ్ దశలోనే ఇంటిబాట పడుతుందని హేళన చేశారు. ఆనాటి జట్టులో సునీల్‌ గావస్కర్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, కృష్ణమాచారి శ్రీకాంత్‌, మదన్‌లాల్‌, రవిశాస్త్రి, సందీప్‌పాటిల్‌, రోజర్ బిన్నీ లాంటి ఎందరో ప్రముఖ ఆటగాళ్లున్నారు. మొత్తం 8 జట్లు.. ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొన్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. భారత్‌ ఉన్న గ్రూపులో డిఫెండింగ్‌ ఛాంపియన్ వెస్టిండీస్‌, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లోనే ఢిపెడింగ్ ఛాపింయన్ వెస్టిండీస్‌ తో తలపడింది. ఈ మ్యాచ్‌లో 34 పరుగులతో విండీస్ టీంపై విజయం సాధించి ట్రోఫీ కోసం ముందుకు సాగింది. ఇక రెండో మ్యాచ్‌లో జింబాబ్వే పై గెలిచి ఆశలు చిగురించేలా చేసింది. కానీ, ఆసీస్‌, వెస్టిండీస్‌లతో వరుసగా ఓటమిపాలైంది. దీంతో మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ విజయాలను సాధిస్తేనే ముందుకు సాగుతుంది. లేదా ఇంటి బాట పట్టాల్సిందే. కపిల్ దేవ్(175 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. కానీ, ఈ మ్యాచ్‌ టీవీల్లో ప్రసారం కాకపోవడంతో కపిల్‌దేవ్‌ చారిత్రక ఇన్నింగ్స్‌ను చూడలేకపోయింది. ఆతరువాత మ్యాచ్‌లో ఆసీస్ ను ఓడించి ప్రపంచ కప్‌ సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్‌తో తలపడిండి. ఈ మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడి ఫెనల్‌కు దూసుకెళ్లింది.

ఢిపెండింగ్ ఛాంపియన్‌తో ఫైనల్.. ఇక అంతిమ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌తో పోరాటానికి సిద్ధమైంది. ఫైనల్లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగింది కపిల్ సేన. వెస్టిండీస్ బౌలింగ్ ధాటికి 183 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. భారత బౌలర్ల ధాటికి 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో 43 పరుగులతో వెస్టిండీస్‌పై విజయం సాధించి, తొలి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఈ అద్బుతం జరిగి నేటికి 38 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా బీసీసీఐ ఆ నాటి విజయాన్ని గుర్తుచేస్తూ ట్వీట్ చేసింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ… ఆ ట్వీట్‌ను వైరల్ చేశారు.

Also Read:

వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..

Rubiks Cube World Record : సచిన్ టెండూలర్క్‌ను ఫుల్ ఫిదా చేసిన ఆ కుర్రాడు మరో అద్భుతం సాధించాడు

Sania Mirza: మరో సంచలనం.. మరో చరిత్ర.. తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డ్..