Sourav Ganguly: ‘సచిన్‌ అన్న మాటలు నాకింకా గుర్తున్నాయి’: 25 ఏళ్ల నాటి సంగతి గుర్తుచేసుకున్న గంగూలీ!

1992లో వన్డేలో ఎంట్రీ ఇచ్చిన గంగూలీ, 1996 జూన్ 22 న తొలి టెస్టు ఆడాడు. అయితే, టెస్టు అరంగేట్రంలోనే లార్డ్స్‌ మైదానంలో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.

Sourav Ganguly: 'సచిన్‌ అన్న మాటలు నాకింకా గుర్తున్నాయి': 25 ఏళ్ల నాటి సంగతి గుర్తుచేసుకున్న గంగూలీ!
Sourav Ganguly And Sachin Tendulkar
Follow us
Venkata Chari

|

Updated on: Jun 25, 2021 | 3:21 PM

Sourav Ganguly: టీమిండియా మాజీ సారథి, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 25 ఏళ్ల నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. 1992లో వన్డేలో ఎంట్రీ ఇచ్చిన గంగూలీ, 1996 జూన్ 22 న తొలి టెస్టు ఆడాడు. అయితే, టెస్టు అరంగేట్రంలోనే లార్డ్స్‌ మైదానంలో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఈ సంగతి జరిగి 25 ఏళ్లు కావొస్తోంది. ఈమేరకు అలనాటి విశేషాల్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. “తొలి టెస్టులోనే సెంచరీ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అయితే ఆ రోజు సెంచరీ అనంతరం అలిసిపోయానని, అప్పుడు సచిన్‌ వచ్చి చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుకున్నాయని” గంగూలీ వెల్లడించాడు. సెంచరీ అనంతరం అలసిపోయాను. అయితే టీ బ్రేక్‌ టైంలో సచిన్‌ నా వద్దకొచ్చి.. ప్రశాంతంగా ఉండు. వెళ్లి టీ తాగు’ అని చెప్పాడు. ఆ తరువాత నేను డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తుంటే.. తోటి ఆటగాళ్లంతా నన్ను అభినందించేందుకు ఎదురుగా వచ్చారని’’ గంగూలీ ఆనాటి విషయాలను పంచుకున్నాడు.

“నేను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న ఈటైంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ చారిత్రక టెస్టు సిరీస్‌ సాధించడం తన అదృష్టమని” ఆయన తెలిపాడు. “నా కెరీర్ అద్భుతంగా సాగింది. వన్డేలో ఎంట్రీ ఇచ్చిన నాలుగేళ్లకు నేను టెస్టు మ్యాచ్‌ బరిలోకి దిగాను. అలా ఎంట్రీ మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం గర్వంగా అనిపించింది. అనంతరం కొద్ది కాలంలోనే టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టాను. టీంను బలంగా తయారుచేశాను. భారత్ కు మంచి పేరు వచ్చింది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో కెప్టెన్సీ కోల్పోవడం జరిగింది. ఆ తరువాత బీసీసీఐ అధ్యక్షుడిగా ఇలా.. నాప్రయాణం అంతా సాఫీగానే సాగిందని” గంగూలీ తెలిపాడు. “ఒక క్రీడాకారుడిగా, క్రికెటర్‌గా ఇంతకంటే ఏం కోరుకుంటామని” ఆయన అన్నారు.

ఆ మ్యాచ్‌లో గంగూలీ 131 పరుగులు సాధించాడు. 301 బంతుల్లో 20 బౌండరీలతో శతకాన్ని నమోదు చేసి ఔరా అనిపించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 429 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 9వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. కానీ అప్పటికే ఐదు రోజులు అయిపోవడంతో.. ఆమ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Also Read:

Kapil Dev: ఎప్పటికీ ఆ విజయమే వెరీ వెరీ స్పెషల్! ‘కపిల్స్ డెవిల్స్‌ ఆఫ్ 1983’ అంటూ ఫ్యాన్స్ సందడి

వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..

Indian Cricket Team: వచ్చే డబ్ల్యూటీసీ లో భారత్‌ ఆడే షెడ్యూల్‌ ఇదే!