AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Cricket Team: వచ్చే డబ్ల్యూటీసీ లో భారత్‌ ఆడే షెడ్యూల్‌ ఇదే!

సెకండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో భాగంగా టీమిండియా మొత్తం 19 టెస్టులు ఆడనుంది. ఇందులో విదేశాల్లో మూడు సిరీస్‌లు ఉండగా, స్వదేశంలో మూడు సిరీస్‌లు ఆడనుంది.

Indian Cricket Team: వచ్చే డబ్ల్యూటీసీ లో భారత్‌ ఆడే షెడ్యూల్‌ ఇదే!
Indian Cricket Team
Venkata Chari
|

Updated on: Jun 24, 2021 | 10:44 PM

Share

WTC 2021-23: బుధవారమే తొలి డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ పూర్తయ్యాయి. ఇందులో భారత్, న్యూజిలాండ్‌లు తలపడగా, కివీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా మొదటి ఐసీసీ ట్రోఫీని అందుకోవాలన్న టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ కల నెరవేరలేదు. అయితే, ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్‌తో మరో ఐసీసీ ఈవెంట్ జరగనుంది. దానికంటే ముందు ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆడనుంది టీమిండియా. అయితే ఇంగ్లండ్‌ తో జరగబోయే టెస్టు సిరీస్ 2021-2023 మధ్యలో జరిగే రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరగనున్నాయంట. వీటితో పాటు టీమిండియా మరో రెండేళ్ల వరకు డబ్ల్యూటీసీ పోటీలకు షెడ్యూల్‌ ఒకటి నెట్టింట్లో వైరలవుతోంది. ఇందులో మూడు విదేశీ పర్యటనలతోపాటు స్వదేశంలో మూడు సిరీస్‌లు ఆడనుంది టీమిండియా. మొత్తంగా భారత్ సెకండ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 19 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.

ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఇంగ్లండ్‌ జట్టుతో భారత్ ఆగస్టులో ఐదు టెస్టుల సిరీస్‌ లో తలపడనుంది. ఆగస్టు 4 నుంచి మొదలు కానున్న ఈ ఐదు టెస్టుల సిరీస్ సెప్టెంబర్‌ 14 వరకు జరగనుంది.

కివీస్‌తో.. నవంబర్‌లో న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో రెండు టెస్టులు ఆడనున్నాయి. అయితే, ఈ షెడ్యూల్‌ తేదీలింకా ప్రకటించలేదు. ఇప్పటికే ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టు కివీస్‌తో పేలవ రికార్డును మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లోనైనా గెలుపు బాటలో పడుతుందో, లేక యథావిధిగా ఓటమితో ముగిస్తుందా అనేది చూడాలి.

దక్షిణాఫ్రికా మూడు టెస్టుల సిరీస్‌.. ఈ ఏడాది చివర్లో టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్‌-జనవరి నెలల్లో మూడు టెస్టుల సిరీస్‌ జరగనుంది.

శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్.. వచ్చే ఏడాది ఐపీఎల్‌ 15వ సీజన్‌కు పూర్తవ్వక ముందు భారత పర్యటనకు శ్రీలంక రానుంది. ఈ పర్యటన 2022 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక టీంలు మొత్తం మూడు టెస్టులు ఆడనున్నాయి.

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు.. 2022లో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో నాలుగు టెస్టుల సిరీస్‌ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్‌ సెప్టెంబర్‌-నవంబర్‌ మధ్య జరగనుంది.

బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు.. సెకండ్ డబ్ల్యూటీసీ టోర్నీలో చివరగా బంగ్లా తో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది టీమిండియా. ఈ పర్యటన 2022 నవంబర్‌ నెలలో మొదలవనుందని తెలుస్తోంది.

Also Read:

Tokyo Olympics: భారత మహిళా హాకీ జట్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌గా రాణి రాంపాల్ ఎంపిక

Euro Cup 2020: చరిత్ర సృష్టించేందుకు మరో గోల్ దూరంలో రొనాల్డో; 109 గోల్స్‌తో ప్రపంచ రికార్డు సమం

Make Rohit Indian Captain: ‘కోహ్లీ వద్దు.. రోహిత్ ముద్దు.. కెప్టెన్‌ తోపాటు హెడ్‌ కోచ్‌ను మార్చండి’: మీమ్స్‌ తో నెటిజన్ల ఫైర్