Euro Cup 2020: చరిత్ర సృష్టించేందుకు మరో గోల్ దూరంలో రొనాల్డో; 109 గోల్స్‌తో ప్రపంచ రికార్డు సమం

పోర్చుగ‌ల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్‌లో సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈమేరకు యూరో కప్ 2020 ఫుట్‌బాల్‌ టోర్నీలో భాగంగా ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించి ప్రపంచ రికార్డును సమం చేశాడు.

Euro Cup 2020: చరిత్ర సృష్టించేందుకు మరో గోల్ దూరంలో రొనాల్డో; 109 గోల్స్‌తో ప్రపంచ రికార్డు సమం
Cristiano Ronaldo World Record
Follow us
Venkata Chari

|

Updated on: Jun 24, 2021 | 8:46 PM

Euro Cup 2020: పోర్చుగ‌ల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్‌లో సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈమేరకు యూరో కప్ 2020 ఫుట్‌బాల్‌ టోర్నీలో భాగంగా ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించి ప్రపంచ రికార్డును సమం చేశాడు. అత్యధిక గోల్స్‌ తో అంతకు ముందున్న రికార్డును సమం చేశాడు. కాగా, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధికంగా గోల్స్‌ చేసిన లిస్టులో 109 గోల్స్ తో ఇరాన్‌కు చెందిన ఆటగాడు అలీ డేయూ పేరటి ఉంది. దీనిని బుధవారం జరిగిన మ్యాచ్‌తో ఈ పోర్చుగల్ ఆటగాడు సమం చేశాడు. అయితే, అత్యధిక గోల్స్ సాధించిన లిస్టులో ఇరాన్ ఆటగాడితో కలిసి సంయుక్తంగా నిలిచాడు. మరోవైపు ఇంటర్నేషనల్‌ ఫుట్‌బాల్‌లో చరిత్ర తొలిస్థానంలో నిలిచేందుకు మరో గోల్ దూరంలో నిలిచాడు.

కాగా, ఈ మ్యాచ్ డ్రా గా ముగిసింది. దీంతో పోర్చుగ‌ల్ టీం నాకౌట్‌ దశలోకి ఎంటర్ అయింది. ఈ టోర్నీలో పోర్చుగ‌ల్ మ‌రో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్‌లో రొనాల్డో చరిత్ర సృష్టిస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు. రొనాల్డో ప్రస్తుత యూరో కప్‌లో మూడు మ్యాచ్‌ల్లో 5 గోల్స్‌ చేసి, టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అలాగే టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్‌ సాధించిన ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు యూరో కప్‌లో మొత్తం 14 గోల్స్‌ చేసి ముందజంలో ఉన్నాడు రోనాల్డో. మరోవైపు అత్యధిక గోల్స్ చేసిన జాబితాలో భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ 74 గోల్స్‌తో 11వ స్థానంలో నిలిచాడు. 73 గోల్స్‌తో 12వ స్థానంలో అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ మెస్సీ కొనసాగుతున్నాడు.

Make Rohit Indian Captain: ‘కోహ్లీ వద్దు.. రోహిత్ ముద్దు.. కెప్టెన్‌ తోపాటు హెడ్‌ కోచ్‌ను మార్చండి’: మీమ్స్‌ తో నెటిజన్ల ఫైర్Also Read:

Tokyo Olympics: ‘ఎంజాయ్ చేయాలంటే కుదరదు.. గమ్మున ఉండాల్సిందే’: జపాన్ ప్రభుత్వం!

Viral Photo: ‘ఫొటో ఆఫ్ ది డే’ అంటూ అభిమానుల కామెంట్లు.. కోహ్లీ భుజంపై వాలిన కివీస్ కెప్టెన్! వైరలవుతోన్న ఫొటో