Tokyo Olympics: ‘ఎంజాయ్ చేయాలంటే కుదరదు.. గమ్మున ఉండాల్సిందే’: జపాన్ ప్రభుత్వం!

ఇప్పటికే అథ్లెట్లకు కఠిన నిబంధనలు అమలుచేస్తామని చెప్పిన జపాన్ ప్రభుత్వం.. ప్రేక్షకులకు కూడా అలాంటి కఠిన నిబంధనలే అమలు చేస్తామంటూ షాక్ ఇచ్చింది.

Tokyo Olympics: 'ఎంజాయ్ చేయాలంటే కుదరదు.. గమ్మున ఉండాల్సిందే': జపాన్ ప్రభుత్వం!
Tokyo 2020 Olympic Games
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Jul 05, 2021 | 5:25 PM

Tokyo Olympics: టోక్యో లో జులై నుంచి మొదలుకానున్న ఒలింపిక్స్ లో ప్రేక్షకులను అనుమతిస్తామని నిర్వాహాకులు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, కేవలం 10,000 మందిని మాత్రమే అనుమతిస్తామని, విదేశీయులకు అనుమతి లేదని వెల్లడించారు. ఇప్పటికే అథ్లెట్లకు కఠిన నిబంధనలు అమలుచేస్తామని చెప్పిన జపాన్ ప్రభుత్వం.. ప్రేక్షకులకు కూడా అలాంటి కఠిన నిబంధనలే అమలు చేస్తామని పేర్కొని షాక్ ఇచ్చింది. ఈమేరకు స్టేడియంలో మద్యపానం, షేక్ హ్యాండ్స్‌, అరుపులు, ఆటోగ్రాఫ్‌ లాంటివి చెల్లవని పేర్కొంది. కరోనా నేసథ్యంలోనే ఇలాంటి రూల్స్‌ను అమలుచేయనున్నట్లు టోక్యో ఒలింపిక్స్‌ అధ్యక్షురాలు సీకో హషిమోటో తెలిపారు. ఓవైపు దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ చప్పగా సాగుతుందని, ఇలాంటి సమయంలో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించడం మానుకోవాలని వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒలింపిక్స్ గేమ్స్ జరిపి తీరుతామని జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రతిరోజు 10,000 మంది వీక్షకులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. అయితే, ఈ సందర్భంగా 2020 ఫుట్‌బాల్‌ యూరో కప్‌ లో ఏర్పాటు చేసినట్లుగా.. ఇక్కడి పరిస్థితులు ఉండవని తెలియజేశారు. ‘యూరో కప్ సందర్భంగా ఐరోపాలో స్టేడియాలు ఫుల్ జోష్‌లో ఉన్నాయని, అయితే టోక్యో లో మాత్రం పరిస్థితులు అలా ఉండవని’ హషిమొటొ స్పష్టం చేసింది.

ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకు టెంపరేచర్ కచ్చితంగా చెక్ చేస్తామని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆమె పేర్కొన్నారు. అలాగే స్టేడియంలో మరొకరితో కలవకుండా సోషల్ డిస్టెన్స్‌ పాటించాలని, షేక్‌ హ్యాండ్స్‌ అస్సలు ఇవ్వకూడదని తెలిపారు. క్రీడలు అవ్వగానే స్టేడియం నుంచి నేరుగా ఇళ్లకే వెళ్లాలని, బహిరంగంగా క్రీడల విలేజ్‌లో తిరగొద్దని హెచ్చరించారు. వీటితోపాటు అథ్లెట్లను ఆటోగ్రాఫ్‌లు అడగటం కూడా నిషిద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి నిబంధనలతో అసలు ప్రేక్షకులు హాజరవుతారా లేదా అనేది చూడాలి. టోక్యో వేదికగా జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్​ జరగనున్నాయి.

ఈ ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్​లో భారత్‌ నుంచి దాదాపు 100 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్​ థీమ్​ సాంగ్​ను ఆవిష్కరించారు. కేంద్ర క్రీడా మంత్రి కిరెన్​ రిజిజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెహిత్ చౌహాన్ పాడిన ‘లక్ష్య తేరా సామ్నే హై’ అంటూ సాగే ఈ పాట భారత్ ఒలింపిక్ సంఘం విడుదల చేసింది.

Also Read:

Viral Photo: ‘ఫొటో ఆఫ్ ది డే’ అంటూ అభిమానుల కామెంట్లు.. కోహ్లీ భుజంపై వాలిన కివీస్ కెప్టెన్! వైరలవుతోన్న ఫొటో

Indian Cricket Team: ఫైనల్స్‌లో తడబడుతోన్న టీమిండియా; ఏడేళ్లలో 6 ఐసీసీ ట్రోఫీలు మిస్!

WTC Final 2021: డబ్ల్యూటీసీ మొదటి ఎడిషన్‌లో ఆటగాళ్ల ఫర్‌ఫార్మెన్స్‌; టీమిండియా నుంచి రహానే, అశ్విన్ మాత్రమే!

On This Day: 17 ఓవర్లలో 42 పరుగులకు ఆలౌట్.. టీమిండియా పతనానికి ఆ బౌలరే కారణం.! ఎవరంటే.?

WTC Finals: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి ఐదు కారణాలు.. కోహ్లీ మళ్లీ అవే తప్పులు..