AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Finals: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి ఐదు కారణాలు.. కోహ్లీ మళ్లీ అవే తప్పులు..

WTC Final: మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది.. లీగ్ స్టేజిలో వరుసపెట్టి విజయాల సాధిస్తూ ఫైనల్‌లో ఓటమిని చవి చూడటం టీమిండియాకు అలవాటుగా..

WTC Finals: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి ఐదు కారణాలు.. కోహ్లీ మళ్లీ అవే తప్పులు..
Virat Kohli
Ravi Kiran
|

Updated on: Jun 24, 2021 | 8:57 AM

Share

మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది.. లీగ్ స్టేజిలో వరుసపెట్టి విజయాల సాధిస్తూ ఫైనల్‌లో ఓటమిని చవి చూడటం టీమిండియాకు అలవాటుగా మారింది. గత ఏడేళ్లలో ఆరో ఐసీసీ ట్రోఫీని చేజేతులా కోల్పోయింది. బ్యాటింగ్ వైఫల్యం మాత్రమే కాదు.. తుది జట్టును ఎంపిక చేయడంలో తీసుకున్న నిర్ణయాలు కూడా కోహ్లీసేనను దెబ్బతీశాయి.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్, న్యూజిలాండ్ ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని అందరూ భావించినా.. వరుణుడు అడ్డంగా వచ్చాడు. దీనితో మ్యాచ్ ఫలితం రిజర్వ్ డేలో తేలింది. న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు విభాగాల్లోనూ న్యూజిలాండ్‌కు భారత్ పోటీ ఇవ్వలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ 217 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం కివీస్ 249 పరుగులు చేసి 32 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను 170 పరుగులకు కట్టడి చేసిన న్యూజిలాండ్.. 138 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా చేధించి అద్భుత విజయాన్ని అందుకుంది.

ఇదిలా ఉంటే కోహ్లీ తన కెప్టెన్సీలో మరో ఐసీసీ ట్రోఫీని సాధించలేకపోయాడు. ఈ ఓటమితో భారత అభిమానులు నిరాశ చెందారని చెప్పవచ్చు. ”తుది జట్టులో ఎంపిక చేసిన 11 మంది ప్లేయర్స్.. ఏ గ్రౌండ్ అయినా, ఏ పిచ్ అయినా కూడా చక్కటి ప్రదర్శన చేయగలరు” అని ఫీల్డింగ్ కోచ్ మ్యాచ్ మొదలు కాకముందే మీడియాతో మాట్లాడాడు. మరి ఇప్పుడు ఏం జరిగింది. ట్రోఫీని అందుకోవడం పక్కన పెడితే.. న్యూజిలాండ్ జట్టుకు ధీటుగా నిలవడంలో టీమిండియా పూర్తిగా విఫలమైంది. భారత జట్టు ఓటమికి ఐదు కారణాలు ఏంటో చూద్దాం..

బిగ్ ఇన్నింగ్స్.. లాంగ్ పార్టనర్‌షిప్స్…

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా అర్ధ సెంచరీ సాధించలేకపోయారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ వైస్ కెప్టెన్ అజింక్య రహనే(49)దే టాప్ స్కోర్. రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 41 పరుగులు చేసినా.. ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇదిలా ఉంటే టీమిండియాకు చక్కటి భాగస్వామ్యం ఎక్కడా లభించలేదు. ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో ఎక్కువసేపు ఉండలేదు.

రెండో ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన..

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ చేతులెత్తేసింది. ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయారు. జట్టులో సీనియర్స్ ఉన్నా కూడా ప్రయోజనం లేకపోయింది. పంత్(41) మెరుపులు కూడా భారీ టార్గెట్‌ను నిర్దేశించడంలో ఉపయోగపడలేదు.

ప్రత్యర్ధి లోయర్ ఆర్డర్‌ను అంచనా వేయడంలో విఫలం..

లోయర్ ఆర్డర్‌ను డీల్ చేయడం బట్టే మ్యాచ్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు అంటుంటారు. ఈ మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. న్యూజిలాండ్ లోయర్ ఆర్డర్‌ను టీమిండియా సరిగ్గా అంచనా వేయలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 135 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకుని పరుగులు రాబట్టారు. ఇండియా కంటే ఆధిక్యాన్ని సంపాదించారు.

భాగస్వామ్యాలు ముఖ్యం..

టెస్టుల్లో ఏ జట్టు గెలుపుకైనా పెద్ద భాగస్వామ్యం అవసరం, కానీ అది ఈ మ్యాచ్‌లో జరగలేదు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఉంటే, రెండవ ఇన్నింగ్స్‌లో ఒక్కటి కూడా లేదు. భారత్‌ను ఇదే దెబ్బతీసింది.

స్వింగ్ బౌలర్ లేకపోవడం..

ఇంగ్లాండ్ పిచ్‌లపై స్వింగ్ భలే తిరుగుతుంది. ఖచ్చితంగా ప్రతీ జట్టు ఓ స్వింగ్ బౌలర్‌ను ఖచ్చితంగా ఉంచుకుంటుంది. న్యూజిలాండ్‌లో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథి, కైల్ జమీసన్ ఉండగా.. టీమిండియాలో ఎవరూ లేరు. భువనేశ్వర్‌ను ఎంపిక చేయకపోవడంతో అప్పట్లో నెటిజన్లు కూడా ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.

Also Read:

Viral Video: అందంతో చంపుతున్న సొట్టబుగ్గల సుందరి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.!

Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!

సెహ్వాగ్, డివిలియర్స్ స్టైల్‌లో.. 17 బంతుల్లో 76 పరుగులు.. బౌలర్లకు చుక్కలే చుక్కలు!