Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final 2021: డబ్ల్యూటీసీ మొదటి ఎడిషన్‌లో ఆటగాళ్ల ఫర్‌ఫార్మెన్స్‌; టీమిండియా నుంచి రహానే, అశ్విన్ మాత్రమే!

డబ్ల్యూటీసీ లో మొదటి నుంచి అద్భుతంగా ఆడిన న్యూజిలాండ్ జట్టే తొలి విజేతగా నిలిచింది. దీంతో తొలిసారి ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకుని కేన్ విలియమ్సన్‌ సంబరపడిపోతున్నాడు.

WTC Final 2021: డబ్ల్యూటీసీ మొదటి ఎడిషన్‌లో ఆటగాళ్ల ఫర్‌ఫార్మెన్స్‌; టీమిండియా నుంచి రహానే, అశ్విన్ మాత్రమే!
Wtc Final 2021
Follow us
Venkata Chari

|

Updated on: Jun 24, 2021 | 2:39 PM

WTC Final 2021: డబ్ల్యూటీసీ లో మొదటి నుంచి అద్భుతంగా ఆడిన న్యూజిలాండ్ జట్టే తొలి విజేతగా నిలిచింది. దీంతో తొలిసారి ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకుని కేన్ విలియమ్సన్‌ సంబరపడిపోతున్నాడు. తన హయాంలో కివీస్‌కు ఒక్క ఐసీసీ ట్రోఫీని ఇవ్వాలన్న అతని కల నేటికి నెరవేరింది. మరోవైపు టీమిండియా కూడా మొదటి నుంచి బాగానే ఆడింది. ఫైనల్‌లో మాత్రం బోల్తాపడింది. డబ్ల్యూటీసీ టోర్నీలో అన్ని జట్లపైన విజయం సాధించిన భారత్, న్యూజిలాండ్‌పైన ఆడిన రెండు టెస్టుల్లో ఓడిపోయింది. అలాగే ఫైనల్‌ లోనూ ఓడి న్యూజిలాండ్‌పై ఐసీసీలో చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ మొదటి సీజన్‌ విజేతగా న్యూజిలాండ్ నిలిచింది. మరి తొలి ఎడిషన్‌లో ఓవరాల్‌గా ఆటగాళ్ల ఫర్‌ఫార్మెన్స్‌ ఎలా ఉందో చూద్దాం..

50 కొట్టని భారత ఆటగాళ్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌ నుంచి ఒక్కరు కూడా హాప్ సెంచరీ నమోదు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే చేసిన 49 పరుగులే టీమిండియా అత్యధిక స్కోర్. టీమిండియా ప్లేయర్ల సగటు చూస్తే.. పరేషాన్ అవ్వాల్సిందే. కేవలం 18.55 సగటుతో దారుణంగా బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. అందరూ కలిసి చేసిన పరుగులు 371(ఎక్స్‌ట్రాలను కలపకుండా ). ఇక భారత ప్లేయర్ల స్ట్రయిక్‌ రేట్‌ 37.22 గా ఉంది. భారత ప్లేయర్ల స్ట్రయిక్‌ రేట్‌పై ఫ్యాన్స్, నిపుణులు, మాజీలు ఫైర్ అవుతున్నారు.

టాప్‌ లో టీమిండియా నుంచి ఒక్కడే.. డబ్ల్యూటీసీ మొదటి ఎడిషన్‌ లో టాప్‌ 5లో ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు బ్యాట్స్‌మెన్లు, ఇంగ్లండ్‌ నుంచి ఇద్దరు బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. ఇండియా నుంచి ఒక్కరు మాత్రమే టాప్‌లో చోటు సంపాధించారు. ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ లబూషేన్‌ 13 మ్యాచ్‌ల్లో 1676 పరుగులతో తొలి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో 20 మ్యాచ్‌ల్లో 1660 పరుగులతో జో రూట్‌ నిలవగా, 13 మ్యాచ్‌ల్లో 1341 పరుగులతో స్టీవ్‌ స్మిత్‌ మూడో స్థానంలో నిలిచాడు. ఇక నాలుగో స్థానంలో బెన్ స్టోక్స్ నిలిచాడు(17 మ్యాచ్‌లు 1334పరుగులు). టీమిండియా నుంచి అజింక్య రహానే 18 మ్యాచ్‌ల్లో 1174 పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ నుంచి మాత్రం ఒక్క ప్లేయర్ కూడా లేకపోవడం విశేషం.

1000 పరుగుల జాబితాలో టీమిండియా నుంచి ఇద్దరే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో ఓవరాల్‌గా చూసుకుంటే..టీమిండియా నుంచి అజింక్య రహానే తొలి స్థానంలో నిలిచాడు. మొత్తం 18 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలతో 1174 పరుగులు సాధించాడు. ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ రహానే ఒక్కడే టాప్‌లోనిలవడం విశేషం. విదేశాల్లో మొత్తం 9 మ్యాచ్‌ల్లో 694 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. రహానే తరువాత హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మొత్తం 12 మ్యాచులు ఆడి 1094 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో పాటు ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. హిట్‌మ్యాన్‌ యావరేజ్‌ 60.77గా ఉంది. మిగతా బ్యాట్స్‌మెన్లలో ఒక్కరు కూడా వీరి సరసన చేరలేదు.

అత్యధిక వికెట్లలో మనోడే.. డబ్ల్యూటీసీ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ నిలిచాడు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు సాధించి తొలి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ప్యాట్‌ కమ్మిన్స్‌ నిలిచాడు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 70 వికెట్లు తీయగా, స్టువర్ట్‌ బ్రాడ్‌ 17 మ్యాచ్‌ల్లో 69 వికెట్లతో మూడో స్థానంలో నిలవగా, న్యూజిలాండ్‌ తరపున టిమ్‌ సౌతీ 11 మ్యాచ్‌ల్లో 56 వికెట్లతో నాలుగో స్థానం, అలాగే నథాన్‌ లైయోన్‌ 14 మ్యాచ్‌ల్లో 56 వికెట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. అలాగే

వ్యక్తిగత రికార్డులు.. వ్యక్తిగత రికార్డుల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ తొలి స్థానంలో నిలిచాడు. 2019 లో పాకిస్థాన్‌పై 335 పరుగులు సాధించి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇక వికెట్లలో చూస్తే.. శ్రీలంక బౌలర్ లసిత్ ఎంబుల్‌దెనియా తొలిస్థానంలో నిలిచాడు. 2021 లో ఇంగ్లండ్‌పై 137 పరుగులిచ్చి 7 వికెట్లు సాధించాడు.

Also Read:

WTC Finals: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి ఐదు కారణాలు.. కోహ్లీ మళ్లీ అవే తప్పులు..

World Test Championship: ఫైనల్లో టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించిన న్యూజిలాండ్… తొలి ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌

Ross Taylor: టేలర్‌ సరికొత్త రికార్డు.. అత్యధిక పరుగుల జాబితాలో చేరిన కివీస్ తొలి బ్యాట్స్‌మెన్‌

WTC Final 2021: కివీస్‌ ఓపెనర్‌ లాథమ్‌పై విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ స్లెడ్జింగ్.. ఏమన్నారో తెలుసా? వైరలవుతోన్న వీడియో!

Team India First Victory in ODI: టీమిండియా వన్డేలో తొలి విజయాన్ని ఎప్పుడు నమోదు చేసిందో తెలుసా..?