WTC Final 2021: కివీస్ ఓపెనర్ లాథమ్‌పై విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ స్లెడ్జింగ్.. ఏమన్నారో తెలుసా? వైరలవుతోన్న వీడియో!
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భాగంగా కివీస్, భారత్ పోరాటం చివరి అంకానికి చేరుకొన్న సంగతి తెలిసిందే. రిజర్వ్‌డే న సాగే ఈ మ్యాచ్‌లో డ్రా కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
WTC Final 2021: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భాగంగా కివీస్, భారత్ పోరాటం చివరి అంకానికి చేరుకొన్న సంగతి తెలిసిందే. రిజర్వ్‌డే న సాగే ఈ మ్యాచ్‌లో డ్రా కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి చివరి రోజు ఏదైన అద్భుతం జరుగుతుందో చూడాలి మరి. ఇదిలా ఉంచితే.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ పై స్టెడ్జింగ్ చేసిన వీడియో ఒకటి ఆలస్యంగా బయటకు వచ్చింది.
మూడో రోజు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం.. తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది న్యూజిలాండ్ జట్టు. ఓపెనర్లుగా టామ్ లాథమ్, డెవాన్ కాన్వేలు బరిలోకి దిగారు. నిలకడగా ఆడుతూ.. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. అయితే వికెట్ల కోసం భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో కోహ్లీ, శుభ్‌మన్ లు లాథమ్ పై స్లెడ్జింగ్ చేశారు.
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన ఓ బంతిని కివీస్ ఓపెనర్ లాథమ్ డిఫెన్స్ చేయబోయాడు. కానీ, ఆఫ్ స్టంప్‌కి వైపు వచ్చిన బంతి.. బ్యాట్ కు తాకి సిల్లీ పాయింట్ దిశగా మళ్లింది. దీంతో విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ మొదలుపెట్టాడు. “బంతిని ఎలా ఆడాలో లాథమ్‌కి తెలియదు జాస్’, ‘నువ్వు లాథమ్‌ను కట్టడి చేయగలుగుతున్నావ్’, ‘పెవిలియన్‌కు కూడా పంపగలవు’, ‘సరిగ్గా ఆడలేకపోతున్నాడని లాథమ్‌కు కూడా తెలుసు’, కమాన్ జాస్’ అంటూ లాథమ్‌ను రెచ్చగొట్టాడు. అనంతరం భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా మాటలతో లాథమ్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈ మాటలు కివీస్ ఓపెనర్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి. తను మాటలతో కాకుండా బ్యాట్‌తోనూ సమాధానం చెప్పాడు.
32.2 ఓవర్లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ కోహ్లీ అద్భుత క్యాచ్ తో లాథమ్ పెవిలియన్ చేరాడు. అప్పటి వరకు కివీస్ ఓపెనర్లు అద్భుతంగా ఆడి మొదటి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం అదించారు. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరభించిన భారత్ 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. 32 పరుగులు లీడ్ సాధించింది. పుజారా 12, కోహ్లీ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. రిజర్వ్‌డే కు చేరిన డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆరవ రోజున ఏంజరగనుందో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.
— pant shirt fc (@pant_fc) June 20, 2021
Also Read:
IND Vs NZ, WTC Final 2021 Day 6th Live: న్యూజిలాండ్ టార్గెట్ 139 పరుగులు.. 50 ఓవర్లు..